ఆగస్టు 24న త్రీమెన్ కమిటీ మీటింగ్..ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం మీటింగ్ వాయిదా

ఆగస్టు 24న త్రీమెన్ కమిటీ మీటింగ్..ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సోమవారం మీటింగ్ వాయిదా

హైదరాబాద్, వెలుగు: కృష్ణా బోర్డు త్రీమెన్ కమిటీ మీటింగ్ ఈ నెల 24న జరగనుంది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు బోర్డు సమాచారం ఇచ్చింది. వాస్తవానికి సోమవారం మీటింగ్ జరగాల్సి ఉంది. అయితే ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున మీటింగ్‌‌‌‌కు రాలేమని ఏపీ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసింది.

దీంతో మీటింగ్‌‌‌‌ను 24కు వాయిదా వేశారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలు తమ నీటి వాటాకు సంబంధించి బోర్డుకు ఇండెంట్ పెట్టాయి. ఏపీకి ఒక్క చుక్క నీళ్లు కూడా లేవని తెలంగాణ ఇండెంట్ పెట్టగా.. తెలంగాణకు 30 టీఎంసీల నీళ్లే ఉన్నాయని ఏపీ పేర్కొంది.