కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అసత్య ప్రచారాలు మానుకో..కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పీసీసీ ప్రధాన  కార్యదర్శి చనగాని దయాకర్ ఫైర్ 

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అసత్య ప్రచారాలు మానుకో..కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పీసీసీ ప్రధాన  కార్యదర్శి చనగాని దయాకర్ ఫైర్ 


హైదరాబాద్, వెలుగు: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోవాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ మండిపడ్డారు. సోమవారం గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్యాణ లక్ష్మి పథకంపై, మహిళలపై కేటీఆర్ ఇప్పుడు నకిలీ ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు.

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ పథకాన్ని కేవలం ఒక జీవోకే పరిమితం చేశారు తప్ప, అసెంబ్లీలో చట్టం ఎందుకు చేయలేకపోయారో కేటీఆర్ సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. ఈ పథకాలపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మరని చెప్పారు.