రేప్ చేసి.. 10వ అంతస్తు నుంచి తోసేశాడు

రేప్ చేసి.. 10వ అంతస్తు నుంచి తోసేశాడు
  • ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకునేందుకు యత్నం
  • పోలీసుల విచారణలో నీల్లు నమిలి నిజం ఒప్పుకున్న కిరాతకుడు

కాన్పూర్: తన వద్ద పనిచేస్తున్న 19ఏళ్ల యువతిపై కన్నేసిన 40ఏళ్ల ప్రబుద్ధుడు ఆమెను తన ఫ్లాట్ కు రప్పించుకుని లైంగికంగా లొంగతీసుకునేందుకు యత్నించాడు. డబ్బులు ఆశచూపినా.. యువతి లొంగకపోవడంతో రేప్ చేశాడు. అయితే బాధితురాలు విషయాన్ని పోలీసులకు చెబుతాననడంతో.. యువతిని 10వ అంతస్తుపై నుంచి తోసి చంపేశాడు. ప్రమాదవశాతు కిందపడిపోయి చనిపోయినట్లు నమ్మించేయత్నం చేశాడు. అయితే పోలీసుల విచారణలో హంతకుడు నీళ్లు నమిలి నిజం ఒప్పుకున్నాడు. కాన్పూర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ బీబీజీటీఎస్ మూర్తి తెలిపిన మేరకు  వివరాలు ఇలా ఉన్నాయి. 
కాన్పూర్ నగరంలో ప్రతీక్ వైశ్ (40) డెయిరీ నిర్వహిస్తున్నాడు. తన వద్ద 19ఏళ్ల యువతి పనిచేస్తోంది. ఆమెపై కన్నుపడిన ప్రతీక్ వైశ్.. యువతిని లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. మంగళవారం నగరంలోని గుల్ మొహర్ లో ఉన్న తన ఫ్లాట్ కు రప్పించుకున్నాడు. చాలా రోజులుగా యువతిని లొంగతీసుకునేందుకు యత్నిస్తున్న నిందితుడు తన ఇంట్లోకి వచ్చిన యువతిని లొంగ తీసుకునేందుకు డబ్బులు ఆశపెట్టాడు. తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలని ఎంత ఒత్తిడి చేసినా.. ప్రలోభాలకు గురిచేసినా వినకపోవడంతో రేప్ చేశాడు. యువతి ఏడుస్తూ పోలీసులకు చెబుతాననడంతో ప్రతీక్ వైశ్ కిరాతకంగా ప్రవర్తించాడు. యువతిని తాను నివసిస్తున్న 10వ అంతస్తు నుంచి తోసేశాడు. ప్రమాదం జరిగి చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. 
పోలీసులు అనుమానంతో విచారణ చేయగా.. నిందితుడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. నిందితుడు ప్రవీక్ వైశ్ ను అరెస్టు చేసి కోర్టు అనుమతితో జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు.