ఫ్రీగా ఆధార్‌ అప్‌డేట్‌.. రేపే లాస్ట్‌ డేట్‌

  ఫ్రీగా ఆధార్‌ అప్‌డేట్‌.. రేపే లాస్ట్‌ డేట్‌

ఆధార్ కార్డులో వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి కేంద్రం ఇచ్చిన గడువు జూన్ 14తో ముగియనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని యూఐడీఏఐ  ఆధార్ కార్డులో వివరాలను ఆన్‌లైన్‌లో ఉచితంగానే అప్‌డేట్ చేసుకునే వెసులుబాటును మార్చి 15 నుంచి కలిపిస్తుంది. 

గడువు ముగిశాక  డబ్బులు చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  గతంలో లాగానే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవచ్చు. యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. ప్రతి పదేళ్లకోసారి ఆధార్‌కు సంబంధించిన వివరాలను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

అప్‌డేట్‌ చేసుకోండిలా

 

  • myaadhaar.uidai.gov.in పోర్టల్‌ ఓపెన్‌ చేసి ఫోన్‌ నంబర్‌ నమోదు చేశాక వచ్చే ఓటీపీతో లాగిన్‌ అవ్వాలి
  • ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవడానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలను నిక్షిప్తం చేసేందుకు డాక్యుమెంట్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి
  • ఇందులో పేరు, ఇతర వివరాలను రుజువు చేస్తూ తగిన ధ్రువపత్రాలు ఆప్‌లోడ్‌ చేయాలి
  • అనంతరం చిరునామా నిరూపించేలా మరో ప్రతాన్ని అప్‌లోడ్‌ చేసి సబ్మిట్‌ చేయాలి
  • వెంటనే ఆధార్‌ అప్‌డేట్‌ పూర్తయినట్లు ఫోన్‌ నంబర్‌కు మేసేజ్‌ వస్తుంది
  • ఆధార్‌ అప్‌డేట్‌ కోసం మీ సేవ కేంద్రాల్లో రుసుం వసూలుపై నిబంధనలు జారీ చేశారు
  • బయోమెట్రిక్‌ అప్‌డేట్‌కు రూ.100, డెమోగ్రాఫిక్‌ అప్‌డేట్‌కు రూ.50, ఆధార్‌ డౌన్‌లోడ్‌, కలర్‌ ప్రింట్‌కు రూ.30 చెల్లించాలి
  • ఇందులో ఏమైనా సమస్యలు తలెత్తితే టోల్‌ ఫ్రీ 1947 నంబర్‌ను సంప్రదించవచ్చు.