పత్తి కొనుగోళ్లలో ఆధార్ కీలకం.. ట్రేడర్లతో వికారాబాద్ కలెక్టర్ సమావేశం

పత్తి కొనుగోళ్లలో ఆధార్ కీలకం..  ట్రేడర్లతో  వికారాబాద్ కలెక్టర్ సమావేశం

వికారాబాద్​, వెలుగు:  పత్తి కొనుగోళ్లలో ఆధార్​ కార్డు కీలకమని, ప్రతీ రైతు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్​కు లింక్​ చేసుకోవాలని  వికారాబాద్​ అడిషనల్​ కలెక్టర్​ లింగ్యానాయక్​ అన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేయాలని  అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్​లో పత్తి కొనుగోళ్లపై సంబంధిత అధికారులు, ట్రేడర్లతో  సమావేశం నిర్వహించారు.  పత్తి కొనుగోళ్ల సీజన్​ ప్రారంభం దృష్ట్యా జిన్నింగ్ మిల్లుల వద్ద ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.