హుబ్బళి: రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్‌కు చేరిన జమ్మూ కాశ్మీర్ టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. కర్నాటకతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఇప్పటికే తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన జమ్మూ ఓవరాల్‌గా 477 రన్స్ లీడ్‌లో కొనసాగుతోంది. కమ్రాన్ ఇక్బాల్ (94 బ్యాటింగ్) చెలరేగడంతో.. శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే టైమ్‌కు జమ్మూ రెండో ఇన్నింగ్స్‌లో 57 ఓవర్లలో 186/4 స్కోరు చేసింది.
ఇక్బాల్‌తో పాటు సాహిల్ లోత్రా (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రసిధ్ కృష్ణ 2, విజయ్ కుమార్, శ్రేయస్ గోపాల్ చెరో వికెట్ తీశారు. అంతకుముందు 220/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన కర్నాటక తొలి ఇన్నింగ్స్‌లో 93.3 ఓవర్లలో 293 రన్స్‌కే ఆలౌటైంది. దాంతో జమ్మూకు 291 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. మయాంక్ అగర్వాల్ (160), కృతిక్ కృష్ణ (36) మెరుగ్గా ఆడినా లోయర్ ఆర్డర్ ఫెయిలైంది.
ఆకిబ్ నబీ (5/54) ఐదు, సునీల్ కుమార్, యుధ్వీర్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. మరో రోజు ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్ డ్రాగా ముగిస్తే.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా జమ్మూ కాశ్మీర్‌కు టైటిల్ దక్కుతుంది. మరోవైపు తమ జట్టు సాధించబోయే చరిత్రాత్మక విజయాన్ని తిలకించేందుకు జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా శుక్రవారం హుబ్బళికి చేరుకున్నారు.
