ఆది సాయికుమార్ ‘సైరాబాను’ ఫస్ట్ లుక్ విడుదల..

ఆది సాయికుమార్ ‘సైరాబాను’ ఫస్ట్ లుక్ విడుదల..

ఆది సాయికుమార్ హీరోగా ఫణి కృష్ణ సిరికి తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌‌టైనర్‌‌ ‘సైరాబాను’. హాస్య మూవీస్ బ్యానర్‌‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. కృష్ణకాంత్ పరుచూరి కో ప్రొడ్యూసర్.  స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌‌ను విడుదల చేశారు.

ఇందులో ఆది సాయికుమార్ హిందూ సంప్రదాయ దుస్తుల్లో బైక్ నడుపుతుండగా, తన వెనుక హీరోయిన్ బాంధవి శ్రీధర్ నల్లటి హిజాబ్‌‌తో కూర్చుని ఉంది.  బ్యాక్‌‌గ్రౌండ్‌‌లో ఓ వైపు దేవాలయం, మరోవైపు మసీదు కనిపిస్తున్నాయి. రెండు విభిన్న మతాలు, సంస్కృతుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.