
మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేకు ఆ రాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే కొడుకు ఆదిత్య థాకరే సవాల్ విసిరారు. రాజ్యాంగ విరుద్ధ ముఖ్యమంత్రి (ఏక్‌నాథ్ షిండే) తనపై పోటీ చేయాలన్నారు. ‘నేను నా అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తా. ఆయన తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేయాలి. దమ్ముంటే ప్రస్తుతం ఖాళీగా ఉన్న వర్లీ అసెంబ్లీ స్థానంలో ఆయన నాతో పోటీపడి గెలవాలి’ అని ఆదిత్య సవాల్ చేశారు.
శివసేన రెండుగా చీలిపోయిన అనంతరం షిండే, ఉద్ధవ్ వర్గాల మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో బీఎంసీకి ఎన్నికలు జరగనున్నాయి. ముంబైలో బాగా పట్టున్న శివసేన ఇప్పుడు రెండుగా చీలడంతో, ఈ ఎన్నికల్లో ఇరు వర్గాల ప్రభావం ఎంత మేరకు ఉంటుందోనని చర్చలు సాగుతున్నాయి. వచ్చే ఏడాది మహారాష్ట్రకు ఆసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.