'ఆకాశంలో ఒక తార'లో సాత్విక వీరవల్లి ఫస్ట్ లుక్

'ఆకాశంలో ఒక తార'లో  సాత్విక వీరవల్లి ఫస్ట్ లుక్

దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’.  గీతా ఆర్ట్స్‌‌, స్వప్న సినిమా సమర్పణలో లైట్ బాక్స్ మీడియా బ్యాన‌‌ర్‌‌పై సందీప్ గుణ్ణం, ర‌‌మ్య గుణ్ణం నిర్మిస్తున్నారు. సోమవారం హీరోయిన్‌‌ పాత్రను పరిచయం చేశారు. సాత్విక వీర‌‌వ‌‌ల్లి ఈ మూవీతో హీరోయిన్‌‌గా ఇంట్రడ్యూస్ అవుతోంది.  

రోడ్డు కూడా సరిగా లేని ఓ మారుమూల గ్రామంలో ఉండే ఓ అమ్మాయి ఆకాశంలో తారలను చేరుకోవాలనే కలలు కనడం, అందుకోసం చేసే ప్రయత్నాలను ఇందులో చూపించారు. గ్రామీణ యువతిగా సాత్విక స్క్రీన్‌‌ ప్రెజెన్స్‌‌ ఆకట్టుకుంది. అలాగే జీవీ ప్రకాష్‌‌ బ్యాక్‌గ్రౌండ్‌‌ స్కోర్‌‌‌‌, సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ ఇంప్రెస్ చేశాయి.  టీజర్ చివర్లో దుల్కర్‌‌‌‌ కనిపించాడు. సెన్సిటివ్‌‌ స్టోరీ, బలమైన ఎమోషన్స్‌‌తో ఈ సినిమా ఉండబోతోందని అర్థమవుతోంది. ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది.  సమ్మర్‌‌‌‌లో పాన్‌‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌‌కు ప్లాన్‌‌ చేస్తున్నారు.