కూలీలో దహాగా అమీర్ ఖాన్ లుక్ రివీల్

కూలీలో దహాగా అమీర్ ఖాన్  లుక్ రివీల్

రజినీకాంత్ హీరోగా  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కూలీ’. నాగార్జున, శృతి హాసన్, ఉపేంద్ర ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే వీరి పాత్రలను పరిచయం చేసిన మేకర్స్...  ఫైనల్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గురువారం రివీల్ చేశారు. ఈ చిత్రంలో  బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్   కీలక పాత్రలు పోషిస్తున్నట్టు   ప్రకటించారు. ఇందులో ఆయన దహా అనే పాత్రను పోషించబోతున్నట్టు  తెలియజేస్తూ ఆమిర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. 

 సిగార్ పైప్ పీలుస్తూ స్టైల్‌‌‌‌‌‌‌‌గా నిలబడి ఉన్న ఆయన స్టిల్ ఇంప్రెస్ చేస్తోంది. కథను మలుపుతిప్పే పాత్రలో ఆమిర్ పాత్ర ఉండబోతున్నట్టు తెలుస్తోంది.  ఇందులో రజినీకాంత్ కూలీ నెంబర్ 1421గా దేవా పాత్రలో కనిపించనున్నారు.  సన్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 14న వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా సినిమా విడుదల కానుంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. రజినీకాంత్, ఆమిర్ 29 ఏళ్ల తర్వాత స్ర్కీన్ షేర్ చేసుకోవడం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌గా నిలవనుంది.