ఏడాదిన్నర పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అమీర్ ఖాన్

ఏడాదిన్నర పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అమీర్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్.. తన అభిమానులకు ఓ షాకింగ్ న్యూస్ చెప్పారు. కొద్ది రోజులు సినిమాల నుంచి విరామం తీసుకోవాలని అనుకుంటున్నానని ప్రకటించారు. తాను నటించడం మొదలు పెట్టి 30 సంవత్సరాలు అయిందని.. ఇన్నేళ్లలో ఏదో నష్టపోయానని తన మనసుకు అనిపిస్తోందన్నారు. ఏడాదిన్నర పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. తన ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నానని తన నిర్ణయాన్ని తెలిపారు.

అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్స్‌. ఈ సినిమా గురించి స్పష్టత ఇస్తూ.. ఛాంపియన్స్ సినిమాకు తాను హీరోను మాత్రమే కాదు.. నిర్మాతను కూడా అని అన్నారు. ఆ సినిమాలో తాను నటించకపోయినా మరొక టాప్ హీరోను ఈ సినిమాలో నటించేందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి తాను తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడపాలనుకుంటున్నానని స్పష్టం చేశారు. 

బాలీవుడ్‌లోనే కాదు అన్ని ప్రాంతాల్లోనూ తన నటనతో అమీర్ ఖాన్ అభిమానుల్ని సంపాదించుకున్నారు. విభిన్న పాత్రలతో ఎన్నో సినిమాల్లో అభిమానులను అలరించారు.  ఇటీవల ‘లాల్‌ సింగ్‌ చడ్డా’తో ప్రేక్షకులను పలుకరించారు. అయితే.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది.