IPL 2026 Full Schedule: క్రికెట్ ఫ్యాన్స్ కి అదిరిపోయే శుభవార్త అందింది. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కి సంబంధించిన రెండో ఫేజ్ షెడ్యూల్ ని బీసీసీఐ విడుదల చేసింది. ఇప్పటికే మొదటి దశ షెడ్యూల్ రిలీజ్ చేసిన బీసీసీఐ, ఏప్రిల్ 13వ తేదీ నుంచి రెండవ దశ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు మొత్తం 50 లీగ్ మ్యాచ్ లో జరగనున్నట్లు తెలిపింది. కానీ ప్లే ఆఫ్స్, ఫైనల్స్ షెడ్యూల్ త్వరలోనే విడుదల చేస్తామని బీసీసీఐ తేల్చి చెప్పింది.
ఐపీఎల్ మొదటి దశ మార్చి 28వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు టోర్నమెంట్ కొనసాగనుంది. ఇక ఏప్రిల్ 13వ తేదీ నుంచి మే 24వ తేదీ వరకు రెండవ దశ షెడ్యూల్ కొనసాగుతున్నట్లు మ్యాచ్ లకి సంబంధించిన జాబితాను విడుదల చేసింది. మొదటి దశలో 20 మ్యాచ్ లు జరగనుండగా, ఈ రెండవ దశలో మాత్రం ఏకంగా 50 లీగ్ మ్యాచ్ లు నిర్వహించబోతున్నట్లు తెలిపింది. అంటే లీగ్ దశలో దాదాపు 70 మ్యాచ్ లు జరగబోతున్నాయి. మొత్తం 12 వేదికలలో ఈ మ్యాచ్ లను నిర్వహించబోతుంది. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ ల షెడ్యూల్ అలాగే వేదికలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని బీసీసీఐ పేర్కొనింది.
ఇప్పటికైతే కేవలం లీగ్ దశ మ్యాచ్ లు మాత్రం జరగనున్నట్లు బీసీసీఐ తెలిపింది. కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఈ ఎండాకాలంలో జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల వలన మ్యాచులకు ఎలాంటి డిస్టర్బ్ జరగకుండా దశల వారీగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2026 షెడ్యూల్ ని బోర్డు ప్రకటిస్తోంది.
🚨 THE COMPLETE SCHEDULE OF IPL 2026 🚨 pic.twitter.com/PmivC8wvnw
— Tanuj (@ImTanujSingh) March 26, 2026
🚨 News 🚨
— IndianPremierLeague (@IPL) March 26, 2026
BCCI announces schedule for second phase of #TATAIPL 2026 🗓️
The remainder of the league stage, comprising 50 matches, will be played from April 13 to May 24, 2026, across 12 venues in India 🏟️
More details 🔽https://t.co/iYGnB0Gd2J
