హరీష్ రాణా.. భారత దేశంలో మొట్టమొదటి కారుణ్య మరణం పొందిన వ్యక్తి. 2026 మార్చి 25న 13 ఏళ్ల నరకానికి విముక్తి పలికి ప్రశాతంగా చనిపోయాడు. తను బతికున్నానో లేదో కూడా తెలియని స్థితిలో ఇన్నాళ్లు మంచానికే పరిమితమైన హరీష్ రాణా.. కారుణ్య మరణానికి సుప్రీం కోర్టు అనుమతితో.. మార్చి 25న ఢిల్లీలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
భారతదేశంలో తొలి పాసివ్ యూతనేషియా కేసుగా సుప్రీం కోర్టు గుర్తించిన హరీష్ రాణా, తన మరణానంతరం కూడా ఐదు మంది రోగుల జీవితాలకు కొత్త కాంతిని అందించాడు. హరీష్ మరణించిన తర్వాత కుటుంబం చేసిన అతి పెద్ద నిర్ణయం.. అతని ఐదు అవయవాల దానం. తల్లిదండ్రులు అశోక్ రాణా– నిర్మలా దేవి, సోదరి భవన, సోదరుడు అశీష్ – కుటుంబం మొత్తం ఏకాభిప్రాయంతో హరీష్ అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు. హరీష్ కళ్లను కూడా చేశారు.
అంత్యక్రియల సమయంలో యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మాట్లాడుతూ,
హరీష్ ఇక లేడు కానీ, అతని అవయవాల ద్వారా అనేక మంది జీవితాలు కొత్తగా ఊపిరి పీల్చుకుంటాయి. ఈ కుటుంబం దేశానికి ఆదర్శంగా నిలిచింది అని అన్నారు.
►ALSO READ | సోనియా గాంధీకి అస్వస్థత: ఢిల్లీ ఆసుపత్రిలో చేరిక.. పరిస్థితి నిలకడగా ఉందన్న డాక్టర్లు..
హరీష్ రాణా కుటుంబం 13 ఏళ్లుగా అపారమైన బాధ, ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నా, చివరి ఘడియలో కూడా స్వార్థం లేకుండా ఇతరుల జీవితాలను ఆదుకున్నారు. హరీష్ మరణం తర్వాత కూడా అతను ఐదుగురి జీవితాల్లో జీవించి ఉంటాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా అవయవ దానం పట్ల మరింత అవగాహనను పెంచుతుందని ఆశిస్తున్నారు.
హరీష్ కోమా వెనుక..
2013 నంచి కోమాలో ఉన్నాడు. కారుణ్య మరణం పూర్తయ్యాక అతని అవయవాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. చనిపోయాడని బాధపడేకంటే.. మరొకరిలో తనను చూసుకోవచ్చుననే ఆలోచనతో ఆర్గాన్ డొనేషన్ కు ముందుకు వచ్చారు. బుధవారం అంతిమ వీడ్కోలు సందర్భంగా.. ఏడవద్దు.. అతనికి ఇప్పుడే ప్రశాంతత దొరికింది అంటూ భావోద్వేగానికి గురయ్యారు. దక్షిణ ఢిల్లీలోని గ్రీన్ పార్క్ స్వశాన వాటికలో అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
ఏళ్ల హరీష్ 2013లో పంజాబ్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతూ బాల్కనీ నుంచి పడి తలకు తీవ్రమైన గాయాలతో 13 ఏళ్ల పాటు కోమాలో ఉన్నారు. సుదీర్ఘ నరకయాతన తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 2026 మార్చిలో ఢిల్లీలోని ఎయిమ్స్ పాలియేటివ్ కేర్ యూనిట్‌కు తరలించారు. అతనికి అందిస్తున్న కృత్రిమ పోషణను వైద్యులు నిలిపివేయడంతో సహజ మరణం పొందాడు.
