Traffic Advisory: బెంగళూరులో ట్రాఫిక్ అడ్వైజరీ జారీ.. RCB మ్యాచ్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు

Traffic Advisory: బెంగళూరులో ట్రాఫిక్ అడ్వైజరీ జారీ.. RCB మ్యాచ్‌లకు ప్రత్యేక ఏర్పాట్లు

Traffic Advisory: మరో రెండు రోజుల్లో ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగే తొలి పోరుతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి సంబంధించి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కీలక ట్రాఫిక్ సూచనలు విడుదల చేశారు. మార్చి 28న ఆర్సీబీ vs ఎస్ఆర్హెచ్, ఏప్రిల్ 5న ఆర్సీబీ వర్సెస్ సీఎస్కే మధ్య జరగనున్న మ్యాచ్‌లకు సంబంధించి ఈ మార్గదర్శకాలు రిలీజ్ చేసింది. ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు BMTC బస్సులు, మెట్రో సేవలు ఉపయోగించాలని సూచించారు. ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కీలక మార్గదర్శకాలను విడుదల చేశారు. 

పార్కింగ్ నిషేధిత ప్రాంతాలు: 
* ఎం. చిన్నస్వామి స్టేడియం చుట్టుపక్కల ఉన్న ప్రధాన రోడ్లపై పార్కింగ్ పూర్తిగా నిషేధం
* క్వీన్స్ రోడ్ (బాలేకుంద్రి సర్కిల్ నుంచి CTO జంక్షన్ వరకు)
* ఎంజీ రోడ్ (అనిల్ కుంబ్లే సర్కిల్ నుంచి క్వీన్స్ సర్కిల్ వరకు)
* లింక్ రోడ్ (ఎంజీ రోడ్ నుంచి కబ్బన్ రోడ్ వరకు)
* కబ్బన్ రోడ్ మరియు సమీప జంక్షన్లు
* సెయింట్ మార్క్స్ రోడ్, మ్యూజియం రోడ్
* కస్తూర్బా రోడ్, సెంట్రల్ స్ట్రీట్
* లవెల్లే రోడ్, విట్టల్ మాల్యా రోడ్
* కబ్బన్ పార్క్ లోపలి రోడ్లు (కింగ్ రోడ్, ప్రెస్ క్లబ్ ప్రాంతం, ఫౌంటెన్ రోడ్) ప్రాంతాల్లో వాహనాలు పార్క్ చేస్తే ఫైన్ విధించడంతో పాటు టోయింగ్ చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. 

పార్కింగ్ ప్రదేశాలు: 
* ప్రేక్షకులు వాహనాలను ఈ ప్రదేశాల్లో పార్క్ చేయాలని సూచనలు.. 
* సెయింట్ జోసెఫ్ ఇండియన్ హై స్కూల్ గ్రౌండ్ (సిద్ధలింగయ్య సర్కిల్)
* సెయింట్ జోసెఫ్ యూరోపియన్ స్కూల్ గ్రౌండ్ (మ్యూజియం రోడ్)
* ఫ్రీడమ్ పార్క్ MLCP
* గరుడ మాల్ పార్కింగ్
* యూబీ సిటీ పార్కింగ్
* ట్రాఫిక్ అండ్ ట్రాన్సిట్ మేనేజ్‌మెంట్ సెంటర్ (TTMC) మొదటి అంతస్తులో తమ వెహికిల్స్ పార్క్ చేసుకోవాలని వెల్లడి. 

ఎంట్రీ గేట్లు:
E-1 నుంచి E-3
E-18, E-19, E-22, E-23 (కబ్బన్ రోడ్ వైపు)
E-11 నుంచి E-17 (లింక్ రోడ్ వైపు)
E-05, E-08 (క్వీన్స్ రోడ్ వైపు)

ఎగ్జిట్ గేట్లు:
E-09, E-9A

ప్రత్యేక గేట్:
* E-10 (ప్లేయర్స్, అధికారులు, VIPలకు మాత్రమే అనుమతి)

క్యాబ్ అండ్ ఆటో పాయింట్లు: 
* పికప్ పాయింట్లు: BRV గ్రౌండ్, మానెక్షా పరేడ్ గ్రౌండ్
* డ్రాప్ పాయింట్లు: గేట్ నం. 06, గేట్ నం. 03 దగ్గర