Band Melam Review: ‘బ్యాండ్ మేళం’ కథ ఎలా ఉంది? ‘కోర్ట్’ జోడీ మ్యాజిక్ మళ్లీ వర్కౌట్ అయ్యిందా?

Band Melam Review: ‘బ్యాండ్ మేళం’ కథ ఎలా ఉంది? ‘కోర్ట్’ జోడీ మ్యాజిక్ మళ్లీ వర్కౌట్ అయ్యిందా?

‘కోర్ట్’ చిత్రంతో సక్సెస్ అందుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మరో చిత్రం ‘బ్యాండ్ మేళం’(Band Melam). సతీష్ జవ్వాజీ దర్శకుడు. ప్రముఖ స్టార్ రైటర్, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో చిత్రం రూపుదిద్దుకుంది. టాలీవుడ్‌లో మంచి అంచనాలతో వచ్చిన ఈ మూవీ శుక్రవారం (2026 మార్చి 26న) థియేటర్లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. 

ఈ ‘బ్యాండ్ మేళం’ మూవీ పూర్తిస్థాయి తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రియలిస్టిక్ టీనేజ్ లవ్ స్టోరీ. ఈ చిత్రంలో రోషన్, శ్రీదేవి బావమరదలుగా కనిపిస్తున్నారు. పల్లెటూరి వాతావరణంలో ఈ జోడీ మధ్య సాగే గిల్లికజ్జాలు, అల్లరి, మనస్పర్థలు, ఎమోషనల్ బ్రేకప్ వంటి అంశాలతో రూపొందించారు రైటర్ కోన.

మరి ఈ టీనేజ్ లవ్ ఎంటర్‌టైనర్ ఎలా ఉంది? కోన కంబ్యాక్ ఇచ్చాడా? రోషన్, శ్రీదేవి జంట మళ్ళీ హిట్ కొట్టిందా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. 

‘బ్యాండ్ మేళం’ స్టోరీ:

యాదగిరి అలియాస్ గిరి (హర్ష్ రోషన్). ఇతనికి మ్యూజిక్ అంటే పిచ్చి. టెన్త్ ఫెయిలైన గిరి ఊళ్లో స్నేహితుల‌తో క‌లిసి బ్యాండ్‌మేళం పెడతాడు. పెళ్లిళ్లకు, తద్దినాలకు బ్యాండ్ వాయిస్తుంటాడు. అటు యాదగిరి మరదలు రాజీ (శ్రీదేవి) మాత్రం చదువులో టాపర్. ఇంజనీరింగ్ పూర్తి చేస్తుంది. వీళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి ఒకరికోసం ఒకరు అన్నట్టుగా పెరుగుతారు. అంతేకాదు.. పుట్టుకతోనే వీళ్ల పెళ్లి కూడా నిశ్చయం అయిపోతుంది.

కానీ కాలక్రమంలో పరిస్థితులు మారిపోతాయి. గిరి తండ్రి సుందరయ్య (గోపరాజు విజయ్) దానధర్మాల కారణంగా కుటుంబం పేదరికంలో పడిపోతుంది. మరోవైపు, సుందరయ్య సహాయం పొందిన రాజీ తండ్రి సాయన్న (సాయికుమార్) మాత్రం క్రమంగా ఎదిగి ధనవంతుడవుతాడు.

యాదగిరి ఇవేం పట్టించుకోకుండా చిన్న‌త‌నం నుంచే మ‌ర‌ద‌లిని పిచ్చిగా ప్రేమిస్తూ వస్తాడు. కానీ ఆమె అతన్ని ఏ మాత్రం పట్టించుకోదు. సాయన్న కూడా గిరి ప్రేమను అంగీకరించక, రాజీకి మరో సంబంధం కుదుర్చేస్తాడు. అయితే.. పెళ్లి రోజు రాత్రే రాజీ తన క్లాస్ మేట్ రాజేష్తో లేచిపోతుంది.

ఈ సంఘటన గిరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ తర్వాత అతను తీసుకున్న నిర్ణయాలు, జరిగిన పరిణామాలే మిగతా కథ.

ఎలా ఉందంటే: 

ఇదొక నిబ్బా నిబ్బీలా ప్రేమకథ. కోర్ట్ సినిమాకు వచ్చిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మనసుని టచ్ చేసే లవ్ స్టోరీ గానీ, సస్పెన్స్ చేసే ట్విస్టులు గానీ కథలో ఉండవు. కథా పాతదే.. కథనం కూడా పాతదే అయిపోయేసరికి.. వీళ్లు చేసే నటన కూడా చిన్నపిల్లల అల్లరిలా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న అదే ఫార్మాట్ లోనే బ్యాండ్ మేళం రావడం పూర్తిగా నిరాశపరుస్తుంది.

►ALSO READ | Operation Sindoor: వెండితెరపై రియల్ సర్జికల్ స్ట్రైక్స్.. 'ఆపరేషన్ సిందూర్' ప్రకటించిన వివేక్ అగ్నిహోత్రి!

‘చదువు అబ్బని ఓ కుర్రాడు.. డబ్బున్న మరదలిని ప్రేమించడం.. ఇంతలోనే వారి ప్రేమకు ఆస్తిపాస్తులు అడ్డురావడం, విడిపోవడం.. చివరకు ట్రాజెడీ జరగడం.. ఆ తర్వాత ఒక్కటవ్వడం’ వంటి లైన్తో వచ్చిన కథలను ఎన్నో ఏళ్లుగా చూస్తూ వస్తున్నాం. ఇది కూడా ఆ కోవకే చెందడంతో కథలో కొత్తదనం కనిపించదు. 

అయితే బ్యాండ్‌మేళం సినిమా పూర్తిగా సినిమా నిరాశపరచదు. తెలంగాణ నెటివిటీతో పాటు.. బ్యాండ్‌మేళం ఎపిసోడ్స్, ఫ్రెండ్స్‌తో చేసే రచ్చ, కొన్ని కామెడీ సీన్లు మెప్పిస్తాయి.

ముఖ్యంగా గిరి-రాజీ మధ్య లవ్ ట్రాక్, బ్రేకప్ సన్నివేశాలు కొన్ని చోట్ల ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్, క్లైమాక్స్‌కు ముందు వచ్చే సన్నివేశాలు కొంత ఆసక్తిని కలిగిస్తాయి. ఇలా మొత్తం మీద, బ్యాండ్ మేళం పాత ఫార్ములాతో వచ్చిన సాధారణ ప్రేమకథగా నిలుస్తుంది. 

నటీనటులు:

గిరి పాత్రలో హర్ష్ రోషన్ నేచురల్‌గా కనిపించాడు. బ్యాండ్‌మేళం లీడర్‌గా అతని బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా ఓకే అనిపిస్తాడు. రాజీ పాత్రలో శ్రీదేవి మెప్పించింది. వీళ్లిద్దరి కెమిస్ట్రీ, డ్యాన్స్‌ ఇరగదీశారు.

హీరో గ్యాంగ్‌గా కనిపించిన వాళ్లు ఎక్కువగా కొత్తవాళ్లే అయినా, వారు సహజంగా నటించారు. ఫ్రెండ్స్ ట్రాక్ సినిమాలో కీలకంగా నిలిచింది. ముఖ్యంగా ఆ గ్యాంగ్‌లో ఉన్న అమ్మాయి పాత్ర ప్రేక్షకులకు గుర్తుండేలా ఉంటుంది. సీనియర్స్ యాక్టర్స్ సాయి కుమార్, గోపరాజు నటన ఒకే.