హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5న జరిగే SRH Vs LSG మ్యాచ్ టికెట్లపై అప్డే్ట్ వచ్చేసింది. ఏప్రిల్ 5న మధ్యాహ్నం 3:30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ టికెట్లను గురువారం సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేయనున్నారు.
ఈ మ్యాచ్ నేరుగా వీక్షించాలనే అభిమానులు డిస్ట్రిక్ యాప్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. రెండు టికెట్లకు ఒక సన్ రైజర్స్ హైదరాబాద్ జెర్సీ ఫ్రీగా పొందొచ్చు. ఆఫ్ లైన్ లో కూడా టికెట్లు అభిమానులకు అందుబాటులో ఉంటాయి.
అయితే.. ఆఫ్ లైన్ టికెట్లను ఎక్కడ విక్రయిస్తారనే విషయంలో ప్రస్తుతానికి స్పష్టత లేదు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్సీ బాధ్యతలను భుజానికెత్తుకున్నాడు. వెన్ను నొప్పి కారణంగా రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తొలి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. కమిన్స్ గాయం నుంచి కోలుకుంటున్నాడు. కమిన్స్ పూర్తిగా కోలుకునేవరకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. అభిషేక్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
►ALSO READ | Dinesh Karthik: ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో దినేష్ కార్తీక్కి చోటు
