SRH vs LSG Tickets: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్: 5 అంటే ఐదు నిమిషాల్లో టికెట్లు క్లోజ్.. వెయిట్ చేసినంతసేపు పట్టలేదు నిరుత్సాహానికి..

SRH vs LSG Tickets: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్: 5 అంటే ఐదు నిమిషాల్లో టికెట్లు క్లోజ్.. వెయిట్ చేసినంతసేపు పట్టలేదు నిరుత్సాహానికి..

SRH vs LSG Tickets: IPL కౌంట్ డౌన్  స్టార్ట్ అయింది.. మార్చి 28వ తేదీ నుంచి మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఇక హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5వ తేదీ ఫస్ట్ మ్యాచ్.. లక్నో సూపర్ జెయింట్స్ తో హైదరాబాద్ సన్ రైజర్స్ పోటీ పడనున్నాయి. ఈ సీజన్ లో ఉప్పల్ స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ ఇదే కావటంతో ఫ్యాన్స్.. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే వారం ముందుగానే.. అంటే మార్చి 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఆన్ లైన్ లో టికెట్లు ఓపెన్ చేశారు. ఒక్కసారి అభిమానులు ఆన్ లైన్ లోకి వచ్చేశారు.. టికెట్లు ఓపెన్ కావడంతో వెంటనే ఫటా ఫట్.. ధనాధన్ బుకింగ్ కోసం ఎగబడిపోయారు. జస్ట్ 5 అంటే ఐదు నిమిషాల్లోనే.. టికెట్ దొరికే ఛాన్స్ రేటింగ్ పడిపోయింది. 

5 గంటలకు టికెట్ల బుకింగ్ ఓపెన్ చేస్తే.. 5 గంటల 25 నిమిషాలకే 60 వేల మంది టికెట్లు కొనుగోలు చేసేందుకు ఆన్ లైన్ లో క్యూ కట్టారు. ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 39 వేలు నుంచి 55 వేల వరకు ఉంది. జస్ట్ 25 నిమిషాల్లోనే.. 60 వేల మంది టికెట్ కోసం ఆన్ లైన్ లోకి వచ్చేయడంతో క్షణాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. మొత్తం టికెట్లలోనూ వీఐపీ.. వీవీఐపీ కోటాలు ఉంటాయి. ఇవన్నీ పోగా జనరల్ ఆడియన్స్ కు సుమారు 30 వేల టికెట్ల వరకు వస్తాయని అంచనా.. అంచనాలకు మించి టికెట్ల ధర రెండు, మూడు రెట్లు పెరిగింది.  

టికెట్ రేట్లను 800 రూపాయల నుంచి స్టార్ట్ చేయగా.. అత్యధికంగా 23 వేల రూపాయల వరకు పెట్టారు. ఏ కేటగిరీలోనూ టికెట్ దొరకలేదు. 800 రూపాయలు కాదుకదా.. 23 వేల రూపాయల టికెట్ కోసం ప్రయత్నించిన ఫ్యాన్స్ సైతం నిరుత్సాహానికి గురయ్యారు. అరేరే.. వెయిట్ చేసినంతసేపు పట్టలేదు నిరుత్సాహ పడటానికి.. ఐపీఎల్ టికెట్ నీకు దొరికిందా.. నీకు దొరికిందా అంటూ ఫ్రెండ్స్ చాట్ చేసుకోవటం కనిపించింది. ఒకరికి కాకపోతే మరొకరికి టికెట్లు దొరకొచ్చు అనే ఉద్దేశంతో క్రికెట్ అభిమానులు మొత్తం ఆన్ లైన్ లో వెయిటింగ్ చేశారు.. తీరా బుకింగ్ ఓపెన్ అయిన 5 నిమిషాల్లోనే కోటా కంప్లీట్ కావటమేకాదు.. టికెట్ దొరికే ఛాన్స్ అత్యంత తక్కువ రేటింగ్ కు పడిపోవటంతో ఫ్యాన్స్ లో నిరుత్సాహం నెలకొంది.