
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పంజాబ్ లో విజయం తర్వాత ఆప్ హిమాచల్ ప్రదేశ్ పై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తో కలిసి హిమాచల్ ప్రదేశ్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్, బీజేపీ తో ఎలాంటి ఉపయోగంలేదని, ఆప్ తో మాత్రమే మార్పు సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. మొత్తం 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ లో ఎలాగైనా పాగా వేసేందుకు ఆప్ ప్రయత్నం చేస్తోంది.
#WATCH | Delhi CM & AAP national convenor Arvind Kejriwal along with Punjab CM Bhagwant Mann hold a roadshow in Himachal Pradesh's Kullu pic.twitter.com/oZPGfxbMsw
— ANI (@ANI) June 25, 2022