యాదాద్రి, వెలుగు : డబ్బులు సరిగా రాకపోవడంతో ఆసరా పింఛన్ల పంపిణీ మధ్యలోనే నిలిచిపోయింది. గడిచిని ఐదు రోజులుగా లబ్ధిదారులు పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్న్నారు. యాదాద్రి జిల్లాలోని 17 మండలాలు, 6 మున్సిపాలిటీల్లో మొత్తంగా 96,425 మందికి ఆసరా అందుతోంది. వీరందరికీ కలిపి ప్రతి నెలా రూ.23 కోట్ల వరకు ఇస్తున్నారు.
అయితే ఏప్రిల్ నెలకు సంబంధించిన పింఛన్ మే 20 తర్వాత ప్రారంభించారు. రూ. 12 కోట్లు మాత్రమే రావడంతో గత నెల 28 వరకూ పింఛన్లు అందించారు. రావాల్సిన రూ. 11 కోట్లు రాకపోవడంతో పింఛన్ల పంపిణీ నిలిపివేశారు. పింఛన్ కోసం వచ్చిన వారికి ఇయ్యాల, రేపు అంటూ చెబుతున్నారు. దీంతో లబ్ధిదారులు రోజూ తిరిగి పోతున్నారు.
