విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు క్షమాపణలు చెప్పిన డివిలియర్స్

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు క్షమాపణలు చెప్పిన డివిలియర్స్

టీమిండియా  స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మపై తప్పుడు సమాచారం ప్రచారం చేసినందుకు దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ మరోసారి క్షమాపణలు చెప్పాడు. నా స్నేహితుడు విరాట్ కోహ్లి ఇప్పటికీ అందుబాటులో లేడు. అతనికి మనం అర్ధం చేసుకొని గోప్యత ఇవ్వాలి. ఎవరికైనా కుటుంబం మొదటి ప్రాధాన్యత. అసలు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. నా మునుపటి షోలో పొరపాటు జరిగిందనీ.. అందుకు కోహ్లీ కుటుంబానికి క్షమాపణలు చెబుతున్నాను. అని ఏబీ డివిలియర్స్ అన్నారు.

మొదట కోహ్లీ మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నాడని.. అందుకే టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత తాను చేసిన వ్యాఖ్యలపై ఏబీ డివిల్లర్స్ యూటర్న్ తీసుకున్నాడు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మలు తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారనే వార్తలు నిజం కాదని ఏబీ డివిల్లర్స్ చెప్పారు. నేను నా యూట్యూబ్ ఛానల్ లో ఒక భయంకరమైన తప్పు చేసాను. వారి గురించి తప్పుడు సమాచారాన్ని ఇచ్చాను. కానీ అందులో నిజం లేదని డివిలియర్స్ అన్నారు.

ALSO READ :- SA20, 2024: మనోళ్లదే కప్: వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకున్న సన్ రైజర్స్

వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు దూరమైన కోహ్లీ.. తాజాగా చివరి మూడు టెస్టులకు దూరమయ్యాడు. ఇప్పటికే  కోహ్లీ విషయంలో గోప్యతను గౌరవించాలని బీసీసీఐ ప్రతి ఒక్కరినీ కోరినప్పటికీ.. కోహ్లీ అమ్మ గారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని పుకార్లు వ్యాపించాయి. అయితే ఈ వ్యాఖ్యల్లో నిజం లేదని విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వారి తల్లి ఆరోగ్యం గురించి వస్తున్న పుకార్లను కొట్టిపారేశాడు. చివరిసారిగా 2020లో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ లో భాగంగా అడిలైడ్‌ టెస్ట్ తర్వాత కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల సుదీర్ఘ విరామం తీసుకున్నాడు.