వరల్డ్ కప్ విజేతపై డివిలియర్స్ జోస్యం.. ఆ నాలుగు జట్లు సెమీస్కు..రెండు జట్లు ఫైనల్కు..

వరల్డ్ కప్ విజేతపై డివిలియర్స్ జోస్యం.. ఆ నాలుగు జట్లు సెమీస్కు..రెండు జట్లు ఫైనల్కు..

అక్టోబర్ 5 నుంచి వన్డే వరల్డ్ కప్ జరగనుంది. భారత్ వేదికగా జరిగే ఈ మెగా ఈవెంట్లో టీమిండియా సహా నాలుగైదు జట్లు ఫేవరెట్గా బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ 2023 విజేతగా ఏ జట్టు అవతరిస్తుందో  అని అభిమానులు, మాజీ ఆటగాళ్లు తమ అంచనాలను ప్రకటించేస్తున్నారు.  ఈ క్రమంలోనే సౌతాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్  వన్డే వరల్డ్ కప్ విజేత ఏదో చెప్పేశాడు. అంతేకాదు ఫైనల్కు చేరే జట్లు..సెమీస్కు చేరే జట్లను కూడా ప్రకటించేశాడు. 

వరల్డ్ కప్ 2023 విజేత, ఫైనల్ చేరే జట్లు, సెమీస్ చేరే జట్లపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్  ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ టోర్నీలో  సెమీస్  చేరే జట్ల వివరాలను వెల్లడించాడు. తన అంచనా ప్రకారం వరల్డ్ కప్లో టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు  సెమీఫైనల్ చేరుతాయని డివిలియర్స్ చెప్పాడు.  ఫైనల్కు మాత్రం  టీమిండియా,  -ఆస్ట్రేలియా చేరుకుంటాయన్నాడు. 

ఫైనల్లో ఏది గెలుస్తుందంటే..
ఈ వరల్డ్ కప్ను భారత్ దక్కించుకోవాలంటే విరాట్ కోహ్లీ రాణించాల్సిందేనని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. భారత విజయాశకాశాలు కోహ్లీ రాణింపుపై ఆధారపడి ఉన్నాయని తెలిపాడు. అతను దుమ్మురేపితే టీమిండియాదే  టైటిల్‌ అని అభిప్రాయపడ్డాడు. తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా డివిలియర్స్..ఈ విషయాలన్నీ పంచుకున్నాడు.