Hong Kong Sixes: పాకిస్థాన్ క్రికెటర్ విధ్వంసం.. 6 బంతులకు 6 సిక్సర్లు.. 12 బంతుల్లోనే 55

Hong Kong Sixes: పాకిస్థాన్ క్రికెటర్ విధ్వంసం.. 6 బంతులకు 6 సిక్సర్లు.. 12 బంతుల్లోనే 55

పాకిస్తాన్ క్రికెటర్ అబ్బాస్ అఫ్రిది విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. హాంకాంగ్ సిక్సర్స్ మ్యాచ్‌లో భాగంగా 6 బంతులకు 6 సిక్సర్లు కొట్టి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. శుక్రవారం (నవంబర్ 7) కువైట్‌తో జరిగిన మ్యాచ్ లో ఈ పాక్ బ్యాటర్ ఈ ఘనతను సాధించాడు. క్రికెట్ లో ఒక పాకిస్థాన్ ప్లేయర్ 6 బంతులకు ఆరు సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి. కువైట్ స్పిన్నర్ యాసిర్ పటేల్ బౌలింగ్ లో ఐదో ఓవర్ లో వరుసగా 6 సిక్సర్లు కొట్టి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో ఓవరాల్ గా అబ్బాస్ 12 బంతుల్లోనే 55 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, 8 సిక్సర్లు ఉన్నాయి. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన కువైట్ నిర్ణీత 6 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. బిలాల్ తాహిర్ (6 బంతుల్లో 24), ఉస్మాన్ పటేల్ (9 బంతుల్లో 31) 300 పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశారు. ఛేజింగ్ లో పాకిస్థాన్ 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 124 పరుగులు చేసి చివరి బంతికి ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. అబ్బాస్ అఫ్రిది 12 బంతుల్లోనే 55 పరుగులు చేస్తే.. షాహిద్ అజీజ్ 5 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. ఛేజింగ్ లో పాకిస్థాన్ ఒకదశలో 4 ఓవర్లలో 57 పరుగులు మాత్రమే చేసింది. చివరి రెండు ఓవర్లలో 66 పరుగులు కావాల్సిన దశలో 5 ఓవర్లో 38 పరుగులు.. ఆరో ఓవర్లో 29 పరుగులు రాబట్టి సంచలన విజయాన్ని అందుకుంది.  

24 ఏళ్ల అబ్బాస్ పాకిస్థాన్ తరపున చివరిసారిగా జూలై 2024లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో ఆడాడు. 2024 జనవరిలో పాకిస్థాన్ పై అరంగేట్రం చేసినా జట్టులో ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు. అబ్బాస్ అంతర్జాతీయ రికార్డ్ ఘోరంగా ఉంది. 24 టీ20 మ్యాచ్ ల్లో  12.18 యావరేజ్.. 112.61 స్ట్రైక్ రేట్‌తో కేవలం 134 పరుగులు మాత్రమే చేశాడు. ఈ కారణంగానే పాకిస్థాన్ జట్టులో అతనికి స్థానం దక్కలేదు.