చిన్నతనంలోనే మంచి పనులు : భేష్ అనిపించుకుంటున్న విద్యార్థులు

చిన్నతనంలోనే మంచి పనులు : భేష్ అనిపించుకుంటున్న విద్యార్థులు

రంగారెడ్డి: “నేటి బాలలే రేపటి పౌరులు.. చదువుతో పాటు సంస్కారం, క్రమశిక్షణా ఉండాలి. రోడ్డున పోతుంటే ఎలాంటి పొరపాట్లు జరిగినా .. మనకెందుకులే అనుకుంటే దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది. పరిసరాల పరిశుభ్రత మనందరి హక్కు”. ఇలాంటి మాటలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చెప్పడమే కానీ.. నిజంగా చేసి చూపించరు అనేది జగమేరిగిన సత్యం. ఇలాంటి మాటలను పటాపంచలు చేసి చూపించారు ఇద్దరు విద్యార్థులు. వారి వయసు పట్టుమని పది సంవత్సరాలు కూడా లేవు.

కానీ.. ఓ మంచి పని చేసి పెద్దలు ఆశ్చర్యపోయేలా చేశారు. స్కూల్ అయిపోగానే ఇంటికెళ్తున్న ఇద్దరు స్టూడెంట్స్ రోడ్డు పక్కన ఉన్న ట్రీ గార్డులను సిరి చేశారు. ఇటీవల కురిసిన వానలకు అవి నేలకొరిగాయి. దీంతో మేకలు చెట్లను తిట్టాయని గ్రహించిన ఆ బుద్ధిమంతులు..  ఆ ట్రీ గార్డులను భూమిలోకి దింపి సరిచేశారు. చిన్నారులు చేస్తున్న ఈ మంచి పనికి రోడ్డుపై వెళ్తున్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

అబ్దుల్లాపూర్ మెట్ అనాజ్ పూర్ గ్రామంలో నెలకొరిగిన ట్రీ గార్డులను విద్యార్థులు సరి చేస్తున్నారు అని పోస్ట్ చేశారు. స్కూల్ అయిపోగానే పనికి మాలిన వీడియో గేమ్స్ ఆడే పిల్లలు..ఈ విద్యార్థులను చూసి బుద్ధి తెచ్చుకోవాలని సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.