లార్జర్ దేన్ లైఫ్ కథతో..

లార్జర్ దేన్ లైఫ్ కథతో..

ఎక్సయిటింగ్ కాన్సెప్టులను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌పై మరో క్రేజీ ప్రాజెక్టు రాబోతోంది. ఏప్రిల్ 9న ఉగాది కానుకగా ఈ మూవీ టైటిల్‌‌ను అనౌన్స్‌‌ చేయనున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా సోమవారం  ప్రీ లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు.   అఘోరా ఫెరోషియస్‌‌గా నడుస్తున్నట్లు ఉన్న పోస్టర్‌‌‌‌లో   పుర్రెలు, అగ్ని

మంచు పర్వతాలతో కొత్త యూనివర్స్‌‌ను  చూపిస్తున్నట్టుగా ఉంది. పోస్టర్‌‌పై స్మరామి నారాయణన్ తత్వమవ్యయం అని రాయడం  ఆసక్తికరంగా ఉంది.  ఈ బ్యానర్‌‌‌‌లో తెరకెక్కనున్న తొమ్మిదో సినిమా ఇది.  లార్జర్ దేన్ లైఫ్ కథతో భారీ బడ్జెట్‌‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు.