టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్ లో అసలు తెగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో విధ్వంసం సృష్టించాడు. నాగ్ పూర్ వేదికగా బుధవారం (జనవరి 21) విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే 84 పరుగులు చేసి కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ టీమిండియా ఓపెనర్ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లతో పాటు 8 సిక్సర్లున్నాయి. ఈ క్రమంలో అభిషేక్ శర్మ ఒక వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఈ మ్యాచ్ లో 82 పరుగుల వద్ద అభిషేక్ టీ20 క్రికెట్ లో 5000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20 ఫార్మాట్ లో అత్యంత వేగంగా 5000 పరుగుల మార్క్ అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అభిషేక్ 2898 బంతుల్లో 5000 పరుగుల మార్కును చేరుకున్నాడు. 2942 బంతుల్లో 5000 పరుగుల మార్క్ అందుకున్న విండీస్ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ పేరిట ఉన్న మునుపటి రికార్డును అభిషేక్ బద్దలు కొట్టాడు. టిమ్ డేవిడ్ (3127), విల్ జాక్స్ (3196), గ్లెన్ మాక్స్వెల్ (3239) వరుసగా మూడు, నాలుగు. ఐదు స్థానాల్లో ఉన్నారు.
మెన్స్ టీ20 క్రికెట్ లో ఫాస్టెస్ట్ 5000 పరుగులు చేసిన ఆటగాళ్లు (బంతుల పరంగా)
2898 - అభిషేక్ శర్మ
2942 - ఆండ్రీ రస్సెల్
3127 - టిమ్ డేవిడ్
3196 - విల్ జాక్స్
3239 - గ్లెన్ మాక్స్వెల్
3196 - విల్ జాక్స్
3239 - గ్లెన్ మాక్స్వెల్
అభిషేక్ విశ్వరూపం:
ఈ మ్యాచ్ లో ఇండియా 27 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సంజు శాంసన్ (10), ఇషాన్ కిషాన్ (8) త్వరగానే పెవిలియన్ కు చేరారు. ఒక ఎండ్ లో రెండు వికెట్లు పడినా అభిషేక్ మాత్రం తన విధ్వంసం ఆపలేదు. వరుస పెట్టి బౌండరీల మోత మోగిస్తూ స్టేడియాన్ని హోరెత్తించాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఈ యువ ఓపెనర్.. ఆ తర్వాత మరింతల రెచ్చిపోయి ఆడాడు. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 12 బంతుల్లోనే 35 పరుగులు రాబట్టాడు. 11 ఓవర్లో ఫోర్, రెండు సిక్సర్లతో రెచ్చిపోయాడు. ఇదే ఓవర్లో ఒక భారీ షాట్ కొట్టి ఔట్ కావడంతో అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది.
►ALSO READ | IND vs NZ: అభిషేక్ విధ్వంసంతో టీమిండియాకు భారీ స్కోర్.. న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..?
ఇండియా భారీ స్కోర్:
న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టీ20 టీమిండియా బ్యాటింగ్ లో దుమ్ములేపింది. నాగ్ పూర్ వేదికగా బుధవారం (జనవరి 21) విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ విధ్వంసంతో ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 84 పరుగులు చేసి నెక్స్ట్ లెవల్ ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు చేసి రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో డఫీ, జెమీసన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. సోది, క్లార్క్, సాంట్నర్ లకు తలో వికెట్ దక్కింది.
Abhishek Sharma storms past 5000 T20 runs in fewer balls than any other player 🔥 pic.twitter.com/K8shrhUXLn
— ESPNcricinfo (@ESPNcricinfo) January 21, 2026
