IND vs AUS: అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డ్.. సూర్యను వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర

IND vs AUS: అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డ్.. సూర్యను వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. అతి తక్కువ బంతుల్లో అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ లో (పూర్తి సభ్యత్వ దేశాల లిస్ట్ తీస్తే) 1000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాటర్ గా వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. కేవలం 528 బంతుల్లోనే అభిషేక్ తన 1000 పరుగుల మార్క్ అందుకోవడం విశేషం. అంతకముందు ఈ రికార్డ్ టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పేరిట ఉంది. నిన్నటివరకు ఫాస్టెస్ట్ 1000 పరుగుల మార్క్ ను సూర్య 573 బంతుల్లో పూర్తి చేసి అగ్ర స్థానంలో కొనసాగుతుంటే తాజాగా అభిషేక్ శర్మ ఈ రికార్డ్ బద్దలు కొట్టాడు.  

అంతర్జాతీయ టీ20ల్లో బంతుల పరంగా ఫాస్టెస్ట్ 1,000 రన్స్ చేసిన ఆటగాళ్లు (పూర్తి సభ్య దేశాలు): 

528 - అభిషేక్ శర్మ (భారతదేశం)
573 - సూర్యకుమార్ యాదవ్ (భారతదేశం)
599 - ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్)
604 - గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)  

ఈ మ్యాచ్ కు ముందు 1000 పరుగుల మార్క్ కు 11 పరుగుల దూరంలో ఉన్న ఈ టీమిండియా ఓపెనర్ శనివారం (నవంబర్ 8) బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో జరిగిన మ్యాచ్ లో 11 బంతుల్లోనే 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ లో 1000 పరుగుల మార్క్ ను అందుకున్న అభిషేక్ అతి తక్కువ ఇన్నింగ్స్ ల్లో 1000 పరుగులు చేసిన ప్లేయర్ల లిస్ట్ లో ఐదో స్థానంలో నిలిచాడు. తొలి నాలుగు స్థానాల్లో వరుసగా డేవిడ్ మలాన్, కెండెల్ కడోవాకి, బాబర్ అజామ్, విరాట్ కోహ్లీ ఉన్నారు.  ప్రస్తుతం అంతర్జాత్యా టీ20ల్లో నెంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న అభిషేక్ మరిన్ని రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది.     

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ఐదో టీ20 వర్షం కారణంగా రద్దయింది. శనివారం (నవంబర్ 8) బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో కేవలం 4.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. వర్షం ఎంతసేపటికీ తగ్గకపోవడంతో మ్యాచ్ ను అంపైర్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఐదో టీ20 రద్దు కావడంతో టీమిండియా 2-1 తేడాతో సిరీస్ గెలుచుకుంది. వికెట్ నష్టపోకుండా 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసిన భారత జట్టు భారీ స్కోర్ పై కన్నేసింది. అయితే ఈ దశలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ను ఆపేశారు. వర్షం ఇంతకీ తగ్గకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. గిల్ 16 బంతుల్లో 29 పరుగులు.. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచారు.