ఆసుపత్రి నుంచి అభిషేక్ డిశ్చార్జ్.. నమీబియాతో మ్యాచ్ ఆడతాడా లేదా..?

ఆసుపత్రి నుంచి అభిషేక్ డిశ్చార్జ్..  నమీబియాతో మ్యాచ్ ఆడతాడా లేదా..?

న్యూఢిల్లీ: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. ప్రస్తుతం అభి ఆరోగ్యం ఎలా ఉంది..? నమీబియాతో మ్యాచ్ ఆడుతాడా లేదా..? అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అభిషేక్ హెల్త్ కండిషన్‎పై టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ బిగ్ అప్డేట్ ఇచ్చాడు. 

నమీబియాతో మ్యాచ్‎కు ముందు జరిగిన ప్రీ ప్రెస్ కాన్ఫరెన్స్‎లో తిలక్ మాట్లాడుతూ.. అభిషేక్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడని శుభవార్త చెప్పాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నాడు. అయితే.. నమీబియాతో మ్యాచ్ ఆడుతాడో లేదో జట్టు మెనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుందన్నాడు. 

తాను గాయం నుంచి కోలుకుని వరల్డ్ కప్‎కు తిరిగి రావడం ఆనందంగా ఉందన్నాడు. ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా శ్రమించానన్నాడు. ఇండియా కోసం ప్రపంచ కప్ గెలవాలని కోరుకుంటున్నానని అన్నాడు. అభిమానుల ముందు స్వదేశంలో ప్రపంచ కప్ ఆడాలనే తన కలను సాకారం చేసుకున్నానని పేర్కొన్నాడు. 

కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయిన అభిషేక్ శర్మ నమీబియాతో మ్యాచ్‌ ఆడటంపై సందేహం నెలకొంది. నమీబియాతో జరిగే మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఆడకపోతే అతడి స్థానంలో సంజు సామ్సన్ భారత జట్టులో ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. జట్టులో మూడో ఓపెనర్‌గా ఉన్న సంజు శాంసన్  ఇషాన్ కిషన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే ఛాన్స్ ఉంది.