T20 World Cup : హమ్మయ్యా.. అభి 50 కొట్టేశాడు..! ఫైనల్ మ్యాచులో దుమ్మురేపిన యంగ్ ఓపెనర్

T20 World Cup : హమ్మయ్యా.. అభి 50 కొట్టేశాడు..! ఫైనల్ మ్యాచులో దుమ్మురేపిన యంగ్ ఓపెనర్

గాంధీనగర్: ఈ టీ20 వరల్డ్ కప్‎లో పేలవ ఫామ్‎తో నిరాశ పరుస్తోన్న టీమిండియ యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఫామ్‎లోకి వచ్చాడు. ఆదివారం (మార్చి 8) అహ్మదాబాద్‎లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‎తో జరుగుతోన్న ఫైనల్ మ్యాచులో దుమ్మురేపాడు. ఆట ఆరంభం నుంచే ఎలాంటి ఒత్తిడి లేకుండా సిక్సులు, ఫోర్లు బాదాడు. 

ఈ క్రమంలో 18 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులు బాది తన సహాజ శైలీలో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కీలకమైన ఫైనల్ మ్యాచులో అభి ఫామ్‎లోకి రావడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. మరో ఓపెనర్ సంజు శాంసన్ కూడా దుమ్మురేపుతున్నాడు. దీంతో పవర్ ప్లేలో టీమిండియా 92 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అభి 52, సంజు శాంసన్ 38 క్రీజులో ఉన్నారు. 

భారత్ ప్లేయింగ్ ఎలైవన్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్( వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలైవన్: టిమ్ సీఫెర్ట్(వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మాట్ హెన్రీ, లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ