317 జీవోను రద్దు చేయండి : విజయ్​కుమార్

317 జీవోను రద్దు చేయండి : విజయ్​కుమార్
  •    ఉపాధ్యాయ సంఘాల నేతలు

ఖైరతాబాద్​,వెలుగు :  బీఆర్ఎస్ సర్కార్ 317   జీవో తెచ్చి ఉద్యోగ, టీచర్లను చెల్లా చెదురుచేసిందని జీవో 317  ఎఫెక్టెడ్​ఎంప్లాయీస్​, టీచర్స్​అసోసియేషన్​ రాష్ట్ర అధ్యక్షుడు టి. విజయ్​కుమార్, వర్కింగ్​ ప్రెసిడెంట్​నాగేశ్వరరావు ఆరోపించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు.  వృత్తిలో భాగంగా  జిల్లా నుంచి మరో జిల్లా రోజుకు 4 00 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.  జీవో.317  అమలోకి వచ్చి ఆదివారంతో  రెండేళ్లు అయిన సందర్భంగా బ్లాక్​డేగా పాటిస్తున్నా మన్నారు.  

జీవో కారణంగా స్థానికత కోల్పోయిన  బాధితులకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. టీపీసీసీ  అధ్యక్షుడు గా ఉన్నప్పుడు ఆయనను కలిసి తమ సమస్యను విన్నవించామని, అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తానని  సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు. వచ్చే జూన్​ నాటికి 317 జీవో బాధితులు ఎవరు ఉండరని భావిస్తున్నామని, సీఎం  ఆ దిశగా చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.  ఈ సమావేశంలో సందీప్​,రత్నమాల, మల్లేశ్​,పండరీనాథ్​,కె.మల్లేశ్​ పాల్గొన్నారు.