ఇవాళ (డిసెంబర్ 21)..ఆరాంఘర్ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు

ఇవాళ (డిసెంబర్ 21)..ఆరాంఘర్ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు

గండిపేట, వెలుగు: ఆరాంఘర్ చౌరస్తా మైత్రి హాస్పిటల్ వద్ద రోడ్డు విస్తరణ పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజు తెలిపారు. ఈ రోడ్డును తాత్కాలికంగా మూసివేశామని, పనులు పూర్తయిన వెంటనే రాకపోకలు పునరుద్ధరిస్తామన్నారు.

 బహదూర్‌పురా నుంచి మెహిదీపట్నం వైపు వెళ్లేవారు శివరాంపల్లి నుంచి పిల్లర్ నం. 294 గుండా వెళ్లాలన్నారు. శంషాబాద్ నుంచి వచ్చేవారు విజయ్ ఆయిల్ మిల్ నుంచి పిల్లర్ నం. 300 మీదుగా ప్రయాణించాలని పేర్కొన్నారు. చాంద్రాయణగుట్ట వైపు నుంచి వచ్చేవారు ఆరాంఘర్ అండర్‌ గ్రౌండ్ బ్రిడ్జి ఉపయోగించాలని సూచించారు.