ఇది రౌడీయిజానికి పరాకాష్ట.. జాతి వివక్షపై కోహ్లీ సీరియస్

ఇది రౌడీయిజానికి పరాకాష్ట.. జాతి వివక్షపై కోహ్లీ సీరియస్

ఆస్ట్రేలియాతో జరుగుతున్నమూడో టెస్టు మ్యాచ్ లో  భారత ఆటగాళ్లపై చేసిన జాత్యహంకార వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.  లేటెస్ట్ గా భారత కెప్టెన్ వీరాట్ కోహ్లీ తన ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశాడు. జాత్యహంకార వ్యాఖ్యలు ఏ మాత్రం సహించరాదన్నాడు. ఇలాంటి వ్యాఖ్యలు అసలైన రౌడీ ప్రవర్తనకు  నిదర్శనమన్నాడు. బౌండరీ లైన్ల వద్ద  ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమన్నారు.మళ్లీ ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

ఆస్ట్రేలియా, భారత్‌ల మధ్య సిడ్నీలో జరుగుతున్న మూడో టెస్టు నాలుగోరోజు ఆటలో   బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌పై స్టాండ్స్‌లోని ప్రేక్షకులు జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. దాంతో సిరాజ్.. కెప్టెన్ రహానే‌తో పాటు అంపైర్లకు ఫిర్యాదు చేశాడు. దాంతో అంపైర్లు ఆటను పది నిమిషాల పాటు నిలిపివేశారు. సిరాజ్ ఫిర్యాదుతో పోలీసులు, భద్రతా సిబ్బంది స్టాండ్స్‌‌లోకి ప్రవేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని గుర్తించారు. వారందరినీ భద్రతా సిబ్బంది స్టేడియం నుంచి బయటకు పంపించారు.

గుడ్ న్యూస్.. రోజుకు 2జీబీ డేటా ఫ్రీ

సీఎం ఆస్తి రూ.71 లక్షలు పెరిగింది..మొత్తం ఆస్తి ఎంతంటే.?

ఎంపీలకు ప్రోటోకాల్ ఏది?.. స్పీకర్ కు ఫిర్యాదు చేస్తా