జనగామ అర్బన్, వెలుగు : ఇంటర్ ఫలితాల్లో జనగామ ఏబీవీ జూనియర్ కళాశాల ఉత్తమ ర్యాంకులు సాధించిందని యాజమాన్యం తెలిపింది. ఫస్ట్ఇయర్ఎంపీసీలో చిరుచునగండ్ల వర్షిత, సిరికొండ వెంకటేశ్466 మార్కులతో రాష్ట్రస్థాయిలో 4వ ర్యాంక్, దొంతుల హాసిని 465, దేవర బోయిన సాత్విక్, కావటి సిద్దు 464, బైరగోని మధురిమ, సందెనబోయిన సాహితీ, బాలింగల హర్షవర్ధన్ 463, బీపీసీలో బానోతు తేజస్వి 436, మారపాక అఖిల 435, సీఈసీలో అయేషా సాదియా 481, ఒకేషనల్ విభాగంలో యాంగల్ల సిరి 461 మార్కులు సాధించారు.
సెకండ్ ఇయర్ఎంపీసీలో మీసాల సాయి నిఖిల్ 991, మోటికే మౌణ్యశ్రీ 990, బీపీసీలో బానోతు ఆశ 984, రాపాక అర్చన 982, సీఈసీలో తూర్పాటి చరణ్ 965, ఒకేషనల్ విభాగంలో భారతాల చంటి శ్రీశాంత్ 983 మార్కులతో ప్రభంజనం సృష్టించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపల్ కనకరాజు, శ్రీనివాస్, అధ్యాపకుల బృందం అభినందన తెలిపారు.
