ఏసీబీ వలలో మంచిర్యాల ఏవో

ఏసీబీ వలలో మంచిర్యాల ఏవో

మంచిర్యాల ఆర్డిఓ కార్యాలయంలో ఏవో గా పని చేస్తున్న మనోహర్ రావు  అనే వ్యక్తిని లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు పట్టుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీడియో కవరేజ్ చేసిన ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల కు రెండు లక్షల రూపాయల బిల్లు మంజూరు విషయంలో  మనోహర్ రావు..  రామన్న అనే వ్యక్తిని  రూ.75 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఏసిబి అధికారులు మనోహర్ రావు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.