మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడిన టీచర్లు

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లాలో లంచం తీసుకుంటూ పట్టుబడిన టీచర్లు
  •     రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌ ఫైల్‌‌‌‌‌‌‌‌పై సంతకం చేసేందుకు రూ. 15 వేలు డిమాండ్‌‌‌‌‌‌‌‌
  •     హెచ్‌‌‌‌‌‌‌‌ఎంతో పాటు మరో టీచర్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ

గూడూరు, వెలుగు : రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఫైల్‌‌‌‌‌‌‌‌పై సంతకం చేసేందుకు లంచం తీసుకున్న హెచ్‌‌‌‌‌‌‌‌ఎం, ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి ఎంఈవోతో పాటు ఓ టీచర్‌‌‌‌‌‌‌‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌‌‌‌‌‌‌హ్యాండ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం... డి.రవీందర్‌‌‌‌‌‌‌‌ అనే టీచర్‌‌‌‌‌‌‌‌ మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ జిల్లా గుండెంగ శివారు వాగ్యాతండా స్కూల్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్నాడు. 

ఈ నెల 30న రిటైర్మెంట్‌‌‌‌‌‌‌‌ ఉండడంతో తనకు రావాల్సిన బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన ఫైల్‌‌‌‌‌‌‌‌పై సంతకం చేయాలని గూడూరు మండలం అయోధ్యపురం స్కూల్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌ఎం, ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి ఎంఈవో రవికుమార్‌‌‌‌‌‌‌‌ను కలిశాడు. దీంతో రూ. 15 వేలు ఇస్తేనే ఫైల్‌‌‌‌‌‌‌‌పై సంతకం చేస్తానని చెప్పడంతో రవీందర్‌‌‌‌‌‌‌‌ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. 

వారి సూచనతో రవీందర్‌‌‌‌‌‌‌‌ బుధవారం అయోధ్యపురం స్కూల్‌‌‌‌‌‌‌‌కు వెళ్లి అక్కడ పనిచేస్తున్న టీచర్‌‌‌‌‌‌‌‌ చంద్రమౌళికి డబ్బులు ఇవ్వడంతో... ఆయన హెచ్‌‌‌‌‌‌‌‌ఎం రవికుమార్‌‌‌‌‌‌‌‌కు ఇచ్చాడు. వెంటనే ఏసీబీ ఆఫీసర్లు దాడి చేసి హెచ్‌‌‌‌‌‌‌‌ఎం రవికుమార్‌‌‌‌‌‌‌‌తో పాటు టీచర్‌‌‌‌‌‌‌‌ చంద్రమౌళిని రెడ్‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు. ఇద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఆయన వెంట ఏసీబీ ఎస్సై రాజు ఉన్నారు.