సైబర్ సెక్యూరిటీ బ్యూరో హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఇన్‌స్పెక్టర్

సైబర్ సెక్యూరిటీ బ్యూరో హిస్టరీలోనే ఫస్ట్ టైమ్.. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఇన్‌స్పెక్టర్

హైదరాబాద్‌ అబిడ్స్‌లోని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TG-CSB) ప్రధాన కార్యాలయంలో  ఏసీబీ  అధికారులు  మెరుపు దాడులు నిర్వహించారు. సైబర్ నేరాలను అరికట్టే అత్యున్నత విభాగమైన సైబర్ సెక్యూరిటీ బ్యూరో హిస్టరీలోనే.. ఏసీబీ రైడ్స్ జరగడం ఇదే మొదటిసారి కావడంతో పోలీస్ శాఖలో ఒక్కసారిగా కలవరం మొదలైంది. 

ఈ దాడుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ మహేందర్ 2లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. ఒక కేసు విషయంలో బాధితుడిని వేధిస్తూ.. లంచం డిమాండ్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌పై ఫిర్యాదు అందింది. దీంతో పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. ఇన్‌స్పెక్టర్ మహేందర్ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకుని, వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

►ALSO READ | ప్రేమ పేరుతో బ్లాక్ మెయిల్..బీ ఫార్మసీ విద్యార్థి అరెస్ట్

ప్రస్తుతం అబిడ్స్ ఆఫీస్‌తో పాటు ఇన్‌స్పెక్టర్ మహేందర్‌కు సంబంధించిన నివాసాల్లోనూ ఏసీబీ సోదాలు కొనసాగిస్తోంది. ఈ అవినీతి తిమింగలం వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందనే కోణంలో అధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు. సైబర్ క్రైమ్ ఆఫీస్‌లోనే లంచం అవతారం ఎత్తిన ఇన్‌స్పెక్టర్ గుట్టు రట్టు కావడం ఇప్పుడు సిటీలో హాట్ టాపిక్‌గా మారింది.