ప్రేమ పేరుతో బ్లాక్ మెయిల్..బీ ఫార్మసీ విద్యార్థి అరెస్ట్

ప్రేమ పేరుతో బ్లాక్ మెయిల్..బీ ఫార్మసీ విద్యార్థి అరెస్ట్

ఒకే ప్రాంతం.. ఒకే కాలేజీలో చదువుతున్నాం కదా చనువుగా మాట్లాడటమే ఆ అమ్మాయి చేసిన నేరమైంది.. మాయమాటలు చెప్పాడు.. ప్రేమపేరుతో  వెంటపడ్డాడు.. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.. బాధితురాలితో దిగిన ఫొటోలను అందరికి షేర్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. వేధింపులు  తాళలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కటకటాలు లెక్కిస్తున్నాడు.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ప్రేమపేరుతో బ్లాక్ మెయిల్ చేస్తున్న  బీఫార్మసీ విద్యార్థి పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..  

ప్రేమ,పెళ్ళి పేరుతో యువతిని నమ్మించి లైంగికంగా వేధించి, బ్లాక్ మెయిల్ కు పాల్పడిన బీఫార్మసీవిద్యార్థిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు.తూప్రాన్ కి చెందిన సంతోష్ మేడ్చల్ లోని సిఎంఆర్ కాలేజీలో బి ఫార్మసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.అదే కాలేజీలో చదువుతున్న జవహర్ నగర్ కి చెందిన అమ్మాయితో పరిచయం ఏర్పడింది.అదే అదునుగా భావించిన సంతోష్ ఆ అమ్మాయిని మాయమాటలు చెప్పి ప్రేమా,పెళ్ళి పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.బాధితురాలితో దిగిన ఫోటోలను తమ వారికి పంపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.

►ALSO READ | ఐటీ మేనేజర్ ఉద్యోగం వదిలేసి.. ఆటో నడుపుతోంది! లేడీ డ్రైవర్ రియల్ స్టోరీ వైరల్

బాధితురాలు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అక్కడ జీరో FIR చేసి మేడ్చల్ పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు.రంగంలో దిగిన మేడ్చల్ సీఐ సత్యనారాయణ  నిందితుడిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్టు మేడ్చల్ ఏసిపి శంకర్ మీడియాకు వెల్లడించారు.