సిద్దిపేట మున్సిపాలిటీలో ఏసీబీ తనిఖీలు

సిద్దిపేట మున్సిపాలిటీలో ఏసీబీ తనిఖీలు

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట మున్సిపల్ ఆఫీసులో మంగళవారం ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. మూడేండ్ల కింద నిర్వహించిన సమైఖ్యత వజ్రోత్సవాల్లో అవకతవకలు జరిగాయనే ఫిర్యాదులు వచ్చాయి. 2022లో జరిగిన సమైఖ్యత వజ్రోత్సవ వేడుకల ఖర్చు రూ.30 లక్షలుగా చూపెట్టి, రూ.22.50 లక్షలకే తీర్మానం చేసినట్లు గుర్తించారు. 

మున్సిపల్  చైర్​పర్సన్ భర్త మున్సిపల్ అధికారులను బెదిరించి నిధులను దుర్వినియోగం చేశారని కొందరు కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఏసీబీ డీఎస్సీ సుదర్శన్ మాట్లాడుతూ వజ్రోత్సవ వేడుకల కోసం ఖర్చు చేసిన నిధుల్లో దుర్వినియోగం జరిగిందనే ఫిర్యాదులపై రికార్డులను పరిశీలించి, అధికారుల నుంచి స్టేట్ మెంట్లు రికార్డు చేసినట్లు తెలిపారు.