జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా డీడబ్ల్యూవో ఆఫీస్‌లో ఏసీబీ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఉదయం సుమారు 11 గంటలకు కలెక్టరేట్‌లోని డీడబ్ల్యూవో ఆఫీస్‌కు చేరుకున్న ఏసీబీ అధికారులు, అక్కడి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
గతంలో పనిచేసిన ఒక అధికారిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, ఆ కేసుకు సంబంధించిన ఫైళ్లను ప్రత్యేకంగా వెరిఫై చేస్తున్నట్లు సమాచారం. ఆఫీస్‌లోని ముఖ్యమైన రికార్డులు, పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. ఇప్పటికే సంక్షేమ శాఖపై అనేక ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో, మంగళవారం రాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి.
