అగ్రిగోల్డ్ భూముల కేసు: మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడికి బెయిల్

అగ్రిగోల్డ్ భూముల కేసు: మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడికి బెయిల్

అగ్రిగోల్డ్ భూముల కేసులో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‎లో ఉన్న రాజీవ్‎కు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జోగి రాజీవ్‎తో పాటు అరెస్ట్ అయిన  సర్వేయర్‌ రమేష్‌కు సైతం న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చింది. అంబాపురంలోని అగ్రిగోల్డ్ భూముల విక్రయాల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆగస్ట్ 13న ఏసీబీ అధికారులు జోగి  రాజీవ్‎ను అరెస్ట్ చేశారు. రాజీవ్‎కు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‎లో భాగంగా జైల్లో ఉన్న రాజీవ్ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఇవాళ రాజీవ్‎కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.