
- 14 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సహా 181 మంది అరెస్టు
హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. నెలకు సగటున 22 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు.ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారుల అక్రమాస్తులు సీజ్ చేస్తున్నారు. ఈ ఏడాది 8 నెలల్లో 167 మంది ప్రభుత్వ అధికారులు,14 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని మొత్తంగా 181 మందిని అరెస్ట్ చేశారు.108 ట్రాప్ కేసుల్లో లంచంగా తీసుకుంటున్న రూ.33.12 లక్షలు సీజ్ చేయగా11 ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో రూ.44.30 కోట్లు విలువ చేసే సొత్తును జప్తు చేశారు.
ఈ మేరకు ఏసీబీ డీజీ విజయ్‌కుమార్ ఓ పత్రిక రిలీజ్ చేశారు. జనవరి నుంచి ఆగస్టు వరకు మొత్తం 179 కేసులు నమోదు చేయగా ఇందులో ట్రాప్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు సహా 18 విధుల దుర్వినియోగం కేసులు, 18 రెగ్యులర్ ఎంక్వైరీలు, 21 ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.