ఏసీబీకి చిక్కిని పెద్దపల్లి ఇరిగేషన్ డీఈ

ఏసీబీకి చిక్కిని పెద్దపల్లి ఇరిగేషన్ డీఈ

ఏసీబీ వలకు మరో అవినీతి అధికారి చిక్కాడు. పెద్దపల్లి జిల్లా ఇరిగేషన్ డీఈ రవికాంత్ 80 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని ఓదెల మండలంలో  నీటి పారుదల శాఖ పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ రాజు బిల్లుల కోసం డీఈ రవి కాంత్ ను కోరాడే. బిల్లులు ఇచ్చేందుకు రవికాంత్ రాజును లక్ష రూపాయల లంచం కావాలని డిమాండ్ చేశాడు.

దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. జరిగిన విషయాన్ని ఏసీబీ అధికారులకు వివరించి అతనిపై ఫిర్యాదు చేశాడు. అధికారుల పథకం ప్రకారం రాజు రూ.80 వేలను రవికాంత్ కు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ అధికారులు రవికాంత్ ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పి భద్రయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో సిఐలు సంజీవ్, రాములు, వేణుగోపాల్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు