హైదరాబాద్ : పెన్షన్ పత్రాల ప్రక్రియ పూర్తి చెయ్యడానికి ఓ రిటైర్డ్ ఉద్యోగి నుండి 20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. కోఠిలోని పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న వి.సంజీవ్ కుమార్… బద్దం సురేందర్ రెడ్డి అనే రిటైర్డ్ సివిల్ సర్జన్ ను లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. పెన్షన్ సంబందించిన పత్రాలను అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి పంపడానికి సంజీవ్ కుమార్ 20 వేలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని సురేందర్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శనివారం కోఠి లోని డైరెక్టర్ కార్యాలయంలో సంజీవ్ కుమార్ 20 వేలు లంచం తీసుకొంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
