48 జట్లు, 104 మ్యాచ్‌లు.. భారత్‌లో మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

48 జట్లు, 104 మ్యాచ్‌లు.. భారత్‌లో మ్యాచ్‌లు ఎప్పుడు, ఎక్కడ చూడాలి?

FIFA World Cup 2026: ఫుట్‌బాల్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ ఎత్తున జరగబోయే మెగా ఈవెంట్ ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) కు సర్వం సిద్ధమైంది. అమెరికా, కెనడా, మెక్సికో దేశాలు సంయుక్తంగా హోస్ట్ చేస్తున్న ఈ మెగా టోర్నమెంట్‌లో ఈసారి ఏకంగా 48 టీమ్స్ 104 మ్యాచ్‌లలో తలపడబోతున్నాయి.

అయితే మ్యాచ్‌లు అన్నీ అమెరికా ఖండంలో జరుగుతుండటంతో.. ఇండియాలోని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ మ్యాచ్‌లు చూడాలంటే కొన్ని రాత్రులు నిద్రలు మానుకోవాల్సిందే, కొన్ని తెల్లవారుజాము సమయాల్లో అలారాలు పెట్టుకోవాల్సిందే. మీకోసం ఈ టోర్నమెంట్ కంప్లీట్ షెడ్యూల్ ఇండియన్ స్టాండర్డ్ టైమ్ (IST) ప్రకారం తెలియజేస్తున్నాం.. భారత్ లోని ఫుట్‌బాల్ లవర్స్ కోసం మెజారిటీ మ్యాచ్‌లు ఈ కింద పేర్కొన్న నాలుగు క్రేజీ టైమ్ స్లాట్లలోనే లైవ్ రానున్నాయి. 

హోస్ట్ సిటీస్ లోకల్ టైమింగ్స్– భారత్ లోని సమయం: 
* రాత్రి 9 గంటల 30 నిమిషాలకు (9:30 PM IST)
* అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు (12:30 AM IST)
* తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాలకు (3:30 AM IST)
* మార్నింగ్ 6 గంటల 30 నిమిషాలకు (6:30 AM IST)

ఇంపార్టెంట్ డేట్స్: 
* గ్రూప్ స్టేజ్: జూన్ 12 నుంచి జూన్ 28 వరకు గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతాయి.
* రౌండ్ ఆఫ్ 32: వరల్డ్ కప్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్ 48 టీమ్స్ ఫార్మాట్ రావడం వల్ల రౌండ్ ఆఫ్ 32 ను ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో మొత్తం 16 మ్యాచ్‌లు జూన్ 29 నుంచి జులై 4 వరకు జరుగుతాయి.
* రౌండ్ ఆఫ్ 16: జులై 5 నుంచి జులై 8 వరకు ఈ మ్యాచ్‌లు ఉంటాయి. అర్జెంటీనా, బ్రెజిల్, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లాంటి పెద్ద జట్లు ఇక్కడే తలపడే ఛాన్స్ ఉంది.
* క్వార్టర్ ఫైనల్స్: జులై 10 నుంచి జులై 12 వరకు టాప్ 8 టీమ్స్ మధ్య క్వార్టర్స్ ఫైట్ నడుస్తుంది.
* సెమీ ఫైనల్స్: ఫైనల్ చేరే ఆ రెండు జట్లు ఎవరో తేల్చే సెమీస్ మ్యాచ్‌లు జులై 15, జులై 16 తేదీల్లో జరుగుతాయి.
* మూడో ప్లేస్ మ్యాచ్: సెమీస్‌లో ఓడిన రెండు జట్ల మధ్య థర్డ్ ప్లేస్ కోసం జులై 19న మ్యాచ్ ఉంటుంది.

ALSO READ : బాబర్, రిజ్వాన్, ఆఫ్రిదిలకు నో ప్లేస్..

ఆ గ్రాండ్ ఫైనల్ ఎప్పుడంటే?: 
ఈ మెగా టోర్నమెంట్‌కే హైలైట్ అయిన ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ జులై 20న జరగనుంది. ఇండియాలోని ఫ్యాన్స్ కోసం ఈ ఫైనల్ మ్యాచ్ అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు (12:30 AM IST) స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్‌తో 48 టీమ్‌ల కొత్త ఎరాలో ఫస్ట్ వరల్డ్ కప్ ఛాంపియన్ ఎవరో తేలిపోనుంది.