Pakistan Asian Games squad: జపాన్ వేదికగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో జరగబోయే ఏషియన్ గేమ్స్ (Asian Games 2026)కి సంబంధించిన విషయం ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో మస్తు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మెగా టోర్నమెంట్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తమ 15 మంది సభ్యుల టీ20 స్క్వాడ్‌ను అనౌన్స్ చేసింది. అయితే ఈ జట్టులో పాక్ బోర్డు స్టార్ ఆటగాళ్లందరికీ ఊహించని షాక్ ఇచ్చింది. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (Sahibzada Farhan) ను కెప్టెన్‌గా, అబ్దుల్ సమద్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ.. టీమ్ మొత్తాన్ని యంగ్ ప్లేయర్లతో నింపేసింది.
బాబర్, రిజ్వాన్, ఆఫ్రిదిలకు నో ప్లేస్:
పాకిస్థాన్ సెలెక్టర్లు ఈసారి సీనియర్ ప్లేయర్లకు బిగ్ షాక్ ఇచ్చారు. జట్టులో ఉన్న టాప్ మోస్ట్ సీనియర్లు బాబర్ ఆజం, సల్మాన్ ఆగా, మహ్మద్ రిజ్వాన్, స్టార్ పేసర్లు షాహీన్ షా ఆఫ్రిది, హారిస్ రౌఫ్ లాంటి వారికి ఏషియన్ గేమ్స్ స్క్వాడ్ నుంచి పక్కనబెట్టేశారు. సీనియర్ల స్థానంలో పక్కా యంగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇవ్వాలనే టార్గెట్‌తోనే ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే జట్టులో కాస్త ఎక్స్ పీరియన్స్ ఉన్న సయీమ్ అయూబ్, హైదరలీ, సుఫ్యాన్ ముఖీమ్ వంటి ప్లేయర్లకు మాత్రం ప్లేస్ దక్కింది. యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్టేజ్ మీద తమ సత్తా చాటడానికి ఇది ఒక కిర్రాక్ అపార్చునిటీ అని చెప్పాలి.
ఏషియన్ గేమ్స్ రేసులో మొత్తం 10 టీమ్స్:
ఈసారి జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్ క్రికెట్ ఈవెంట్‌లో మొత్తం 10 పురుషుల జట్లు పోటీ పడనున్నాయి. హోస్ట్ కంట్రీగా జపాన్ డైరెక్ట్‌గా క్వాలిఫై అవ్వగా.. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు నేరుగా ఎంట్రీ ఇచ్చాయి. ఇక మిగిలిన నాలుగు ప్లేస్‌ల కోసం జరిగిన క్వాలిఫైయింగ్ రౌండ్స్ ద్వారా హాంకాంగ్, మలేషియా, ఒమన్, నేపాల్ జట్లు మెయిన్ టోర్నీకి అర్హత సాధించాయి.
ALSO READ : అత్యధిక సార్లు ఫిఫా వరల్డ్ కప్ గెలిచిన టాప్ టీమ్స్ ఇవే
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి టీమిండియా:
గత ఏషియన్ గేమ్స్‌లో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలోని టీమిండియా గోల్డ్ మెడల్ గెలిచి డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈసారి బరిలోకి దిగుతోంది. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు వర్షం పడటంతో ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 18.2 ఓవర్లలో 112 రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాడ్ వెదర్ వల్ల సెకండ్ ఇన్నింగ్స్ జరగలేదు. దీంతో టోర్నమెంట్‌లో హయ్యర్ ర్యాంకింగ్ ఉన్న రూల్ ఆధారంగా ఇండియాకు గోల్డ్ మెడల్ అనౌన్స్ చేశారు. ఈసారి కూడా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో జస్ప్రీత్ బుమ్రా లాంటి స్టార్ ప్లేయర్లతో కూడిన స్ట్రాంగ్ టీమ్‌ను భారత్ పంపిస్తోంది.
ఏషియన్ గేమ్స్కి పాకిస్థాన్ స్క్వాడ్:
సాహిబ్‌జాదా ఫర్హాన్ ( కెప్టెన్), అబ్దుల్ సమద్ (వైస్ కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియల్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఆకిఫ్ జావేద్, అలీ రజా, అరాఫత్ మిన్హాస్, హైదరలీ, హసన్ నవాజ్, మాజ్ సదాఖత్, మహ్మద్ సల్మాన్ మీర్జా, సాద్ మసూద్, సయీమ్ అయూబ్, సుఫ్యాన్ ముఖీమ్.
