ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో ఇండియా బోణీ

ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో ఇండియా బోణీ

జలంధర్‌‌: ఆసియా చాంపియన్స్‌‌ ట్రోఫీ హాకీ టోర్నీలో ఐదుసార్లు చాంపియన్‌‌ ఇండియా బోణీ చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో ఇండియా 13–0తో బంగ్లాదేశ్‌‌పై ఘన విజయం సాధించింది. మన్‌‌దీప్‌‌ సింగ్‌‌ (3, 10, 54వ నిమిషం) హ్యాట్రిక్‌‌ గోల్స్‌‌తో రెచ్చిపోగా, కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ (2, 44వ ని), దిల్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ (43, 44వ ని), హార్దిక్‌‌ సింగ్‌‌ (60, 66వ ని), శీలానంద్‌‌ లక్రా (15వ ని), అభిషేక్‌‌ (18వ ని), నీలకంఠ శర్మ (26వ ని), జుగ్‌‌రాజ్‌‌ సింగ్‌‌ (46వ ని) గోల్స్‌‌ కొట్టారు.

స్టార్టింగ్‌‌ నుంచే దూకుడుగా ఆడిన ఇండియన్ ఫార్వర్డ్స్‌‌ బంగ్లాను ఏ దశలోనూ కోలుకోనీయలేదు. రెండో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్‌‌తో మొదలైన గోల్స్‌‌ వర్షం చివరి వరకు కొనసాగించింది. తొలి హాఫ్‌‌ను 6–0తో ముగించిన ఇండియా.. సెకండాఫ్‌‌లో మరింత వేగంగా ఆడింది. రీ బౌండ్‌‌ బాల్స్‌‌ను కూడా అద్భుతమైన గోల్స్‌‌గా మలిచారు. మ్యాచ్‌‌ మొత్తంలో బంగ్లాదేశ్‌‌ కనీసం ఒక్కసారి కూడా గోల్‌‌ చేసే అవకాశాన్ని సృష్టించుకోలేకపోయింది. గురువారం జరిగే మ్యాచ్‌‌లో ఇండియా.. చైనాతో, బంగ్లాదేశ్‌‌.. మలేసియాతో తలపడతాయి.