
నిర్మల్ జిల్లాలో అవినీతి చేప ఏసీబీ అధికారులకు చిక్కింది. పట్టా మార్పిడికోసం లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికాడు. శనివారం (మే24) నిర్మల్ జిల్లాలోని కడెం ఎమ్మార్వో ఆఫీసులో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ సర్వేయర్ పవార్ ఓమాజీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.
ALSO READ | సైనికుల ఆత్మ స్థైర్యం దెబ్బతీసేలా మాట్లాడొద్దు: కిషన్ రెడ్డి
పట్టామార్పిడి విషయంలో రైతు ప్రభాకర్ నుంచి సర్వేయర్ రూ. 20వేలు డిమాండ్ చేశాడు. అయితే అంత ఇచ్చుకోలేనని 7వేల రూపాయలకు ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఎమ్మార్వో ఆఫీసులో సర్వేయర్ లంచం తీసుకుంటుండగా సర్వేయర్ పవార్ ఓమాజీని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం విషయంలో సర్వేయర్ పై విచారణ కొనసాగుతోంది.
తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా తనఖీలు చేపడుతున్నారు అధికారులు.. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడుతూ హైదరాబాద్లో నలుగురు అధికారులు, సిబ్బంది ఏసీబీకి చిక్కారు. మరో వైపు సూర్యాపేటలో నలుగురు సీనియర్ అధికారులపై వేటు పడింది. సూర్యాపేట డీఎంహెచ్వో కోటాచలంపై వైద్య శాఖ చర్యలు చేపట్టింది.