నిమ్స్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులే లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బినామీలు

నిమ్స్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులే లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బినామీలు
  •     ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగి గణేశ్ పేరిట రూ.2.70 కోట్ల ప్లాట్‌‌‌‌‌‌‌‌, రూ.57 లక్షల విలువైన భూములు
  •     ఆపరేషన్​ థియేటర్​ బార్బర్ ధనరాజు ఇంట్లో రూ.4.94 లక్షలు స్వాధీనం
  •     ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు  

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నిమ్స్‌‌‌‌‌‌‌‌ అడిషనల్‌‌‌‌‌‌‌‌ మెడికల్‌‌‌‌‌‌‌‌ సూపరింటెండెంట్‌‌‌‌‌‌‌‌ నోరి లక్ష్మీ భాస్కర్‌‌‌‌‌‌‌‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. సోదాల్లో సేకరించిన డాక్యుమెంట్లు, బ్యాంక్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్ల ఆధారంగా బినామీ ఆస్తుల గుట్టును విప్పుతోంది. లక్ష్మీ భాస్కర్‌‌‌‌‌‌‌‌ నిమ్స్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులనే బినామీలుగా చేసుకుని అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. ఈ మేరకు నిమ్స్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ థియేటర్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న బార్బర్‌‌‌‌‌‌‌‌ ధన్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ ఇంటితో పాటు క్రెడిట్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ యూనిట్‌‌‌‌‌‌‌‌(సీసీయూ)లో పనిచేస్తున్న ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగి గణేశ్​ఇల్లు సహా లక్ష్మీభాస్కర్‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేసిన మరో ముగ్గురి ఇళ్లలో మంగళవారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులతో సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 21న లక్ష్మీ భాస్కర్‌‌‌‌‌‌‌‌ ఇళ్లలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. బినామీల ఇళ్లలో సోదాల నిమిత్తం ఏసీబీ స్పెషల్‌‌‌‌‌‌‌‌ కోర్టు నుంచి సెర్చ్‌‌‌‌‌‌‌‌ వారెంట్లు తీసుకుని మంగళవారం ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

ప్రధాన బినామీగా కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగి గణేశ్..

నిమ్స్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ థియేటర్‌‌‌‌‌‌‌‌లో బార్బర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న ఉద్యోగి ధన్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ ఇంటితో పాటు సెమీ స్కిల్డ్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగిగా పనిచేస్తున్న డి.గణేశ్​ ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ధన్‌‌‌‌‌‌‌‌రాజ్‌‌‌‌‌‌‌‌ ఇంట్లో రూ.4.94 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిమ్స్‌‌‌‌‌‌‌‌లో కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల నియామకంలో గణేశ్​ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. 

ఈ మేరకు గణేశ్​ పేరిట మహేశ్వరంలో ఉన్న రూ.57 లక్షల విలువైన 3 ఎకరాల వ్యవసాయ భూమి, బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్యే కాలనీ, వేంకటేశ్వర కో-ఆపరేటివ్‌‌‌‌‌‌‌‌ హౌసింగ్‌‌‌‌‌‌‌‌ సొసైటీలో రూ.2.70 కోట్ల విలువైన ఓపెన్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌, రెండు పెట్టుబడులకు సంబంధించి రూ.20 లక్షల విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో రూ.3 లక్షల హ్యాండ్‌‌‌‌‌‌‌‌ లోన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రశీదులను గుర్తించారు. సోదాల్లో గుర్తించిన అదనపు ఆస్తులు, వాటి కొనుగోళ్లకు సంబంధించిన నగదు లావాదేవీలు, పెట్టుబడులపై ఏసీబీ అధికారులు మరింతగా ఆరా తీస్తున్నారు. ఆస్తుల అసలు యజమానులు, ఆర్థిక లావాదేవీల వెనుక ఉన్న సంబంధాలను నిర్ధారించేందుకు పత్రాలు, మనీ ట్రయిల్‌‌‌‌‌‌‌‌ను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు.