సస్పెండెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

సస్పెండెడ్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

హైదరాబాద్: నగరంలోని అల్వాల్ లో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ అనిల్ కుమార్ ఇంట్లో  సోదాలు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న సమాచారంతో ఏప్రిల్ 24వ తేదీ బుధవారం రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలో అధికారులు బొల్లారంలోని అనిల్ నివాసంలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా 34 లక్షల రూపాయల నగదు, 20 తులాల బంగారంతో పాటు కోటి రూపాయల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.

ఫిబ్రవరి 2023లో కీసరలో పనిచేస్తున్న సమయంలో లంచం తీసుకుని సస్పెండ్ అయ్యాడు అనిల్ కుమార్.
ఏసీబీకి పట్టుబడిన అనంతరం జరిగిన విచారణలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో ఇంట్లో సోదరులు నిర్వహించినట్లు తెలిపారు. అనిల్ కుమార్ ను విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఆ విషయమై వారి బంధువుల ఇళ్లలో కూడా సోధాలు నిర్వహిస్తామని తెలిపారు.