హెచ్ఎండీఏ ఆఫీసులో ఏసీబీ సోదాలు

హెచ్ఎండీఏ ఆఫీసులో ఏసీబీ సోదాలు

హైదరాబాద్, వెలుగు: హెచ్ఎండీఏ అధికారుల అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా శంకర్​పల్లి జోన్ అసిస్టెంట్​ప్లానింగ్​ఆఫీసర్(ఏపీఓ) బీవీ కృష్ణకుమార్ అవినీతి వెలుగులోకి వచ్చింది. దీంతో కమిషనర్​దానకిశోర్​ఆయన్ని సస్పెండ్​చేశారు. కృష్ణకుమార్​బీఆర్ఎస్​హయాంలో భారీ అవినీతికి పాల్పడ్డాడని, విచ్చలవిడిగా లేఅవుట్లు, బిల్డింగులకు పర్మిషన్లు ఇచ్చి ప్రాపర్టీదారులు, బిల్డర్ల నుంచి రూ.కోట్లు వెనకేసుకున్నాడని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. 

గురువారం మరోసారి హెచ్ఎండీఏ హెడ్డాఫీసులో సోదాలు నిర్వహించారు. కృష్ణకుమార్​కు చాంబర్​ను తనిఖీ చేశారు. కొందరు ఏపీఓలు, పీఓలను ప్రశ్నించినట్టు తెలిసింది. ముఖ్యంగా ప్లానింగ్​విభాగంలో జరుగుతున్న అవినీతిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇటీవల హెచ్ఎండీఏలో భారీ అవినీతికి కారణమైన శివబాలకృష్ణ ప్రమేయం ఏమైనా ఉందా అని ప్రశ్నించినట్లు తెలిసింది. శివబాలకృష్ణ, కృష్ణకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సహకరించిన మరో ఇద్దరు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ అధికారులపై ఏసీబీ దృష్టి పెట్టినట్టు సమాచారం. బిల్డర్లకు లబ్ధి చేకూర్చేలా ఫైళ్లు క్లియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంలో కృష్ణకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు, కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. రోడ్ల విస్తరణకు సంబంధించిన ఆస్తుల సేకరణలో డాక్యుమెంట్లు పరిశీలించకుండానే దరఖాస్తుదారుల ఫైళ్లు ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిన ఏపీఓ కృష్ణకుమార్​ను ఇటీవల సస్పెండ్​చేసిన సంగతి తెలిసిందే. 

నిబంధనలకు విరుద్ధంగా..  

100 అడుగుల రోడ్డు విస్తరణ కోసం పుప్పాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గూడ సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌330, 332లో 11,698 చదరపు గజాల స్థలాన్ని 2015లో అప్పటి గ్రామ పంచాయతీకి గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసినట్లు తెలుపుతూ శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే వ్యక్తి హెచ్ఎండీఏకు అప్లికేషన్​పెట్టుకున్నాడు. అలాగే సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌314, 315, 316, 317లో 22,046 చదరపు గజాల స్థలాన్ని రహదారి విస్తరణ కోసం 2020లో మణికొండ మున్సిపాలిటీకి గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సెటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశామని వెంకటరమణ అనే వ్యక్తి హెచ్ఎండీఏకు అప్లికేషన్ పెట్టుకున్నాడు. హెచ్ఎండీఏ సేకరించిన ఆయా స్థలాలకు టీడీఆర్(ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైట్స్) ఇవ్వాలని గతేడాది నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌10న అప్లికేషన్లు పెట్టుకున్నారు. 

అయితే యజమాన్యపు హక్కు, లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్యుమెంట్లు పరిశీలించకుండానే సదరు ఫైళ్లను శంకర్​పల్లి జోన్​ఏపీఓ కృష్ణకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. నిర్ణీత భూమి విలువను కానీ, ఎంత మొత్తానికి టీడీఆర్​చేశారన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తం డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై హెచ్ఎండీఏ కమిషనర్​ఏపీఓ కృష్ణకుమార్ ను సస్పెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. మొత్తం వ్యవహారంపై విచారణ చేపట్టాలని ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించారు. కాగా శివబాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు అయిన వెంటనే కృష్ణకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంగ్​లీవ్​పెట్టి అమెరికాకు వెళ్లినట్లు గుర్తించారు. కృష్ణకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరిగొస్తే మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.