జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా మెరుపు దాడులు నిర్వహించారు. గత కొంతకాలంగా కార్యాలయంలోని పలు విభాగాలపై వస్తున్న భారీ అవినీతి ఫిర్యాదులతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.  ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అక్రమాలపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది. ప్లాన్ల అనుమతులు, నిబంధనల ఉల్లంఘనలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే రెవెన్యూ శాఖలో పన్నుల వసూళ్లు, శానిటేషన్ విభాగంలో సాగుతున్న అవినీతిపై కూడా అధికారులు విచారణను ముమ్మరం చేశారు.

 తనిఖీల సందర్భంగా మున్సిపల్ సిబ్బంది ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీలక పత్రాలు, ఫైళ్లను తనిఖీ చేస్తూ.. ఎవరెవరితో లావాదేవీలు జరిగాయనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఏసీబీ అధికారుల రాకతో మున్సిపల్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో సిబ్బందిలో వణుకు మొదలైంది.